మీకు మీరే బెస్టీ..

మన ఆనందాన్ని పంచుకోవాలన్నా, బాధని చెప్పుకోవాలన్నా.. మనల్ని ఓ దారిలో పెట్టాలన్నా స్నేహితులు ఉండాల్సిందే.  అయితే అందరికీ స్నేహితులు ఉండరు. అలాంటప్పుడు మనకి మనమే బెస్టీలుగా మారాలి.

Published : 03 Aug 2023 00:07 IST

మన ఆనందాన్ని పంచుకోవాలన్నా, బాధని చెప్పుకోవాలన్నా.. మనల్ని ఓ దారిలో పెట్టాలన్నా స్నేహితులు ఉండాల్సిందే.  అయితే అందరికీ స్నేహితులు ఉండరు. అలాంటప్పుడు మనకి మనమే బెస్టీలుగా మారాలి..

  • శారీరక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవడానికి.. మీకు మీరే కొన్ని కట్టుబాట్లు పెట్టుకోవాలి. ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తి చేసుకోవాలి. అనవసరమైన ఆలోచనలు మనసులోనికి రానివ్వకూడదు. పోషకాహారం తీసుకుంటూనే వ్యాయామం లాంటి వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి.
  • స్నేహితులతో గడపడానికి వారంలో ఒకరోజు కేటాయించినట్టే మీతో మీరు గడపడం అలవాటు చేసుకోండి. మీ ఇష్టాలు, అభిరుచుల గురించి మరింత తెలుసుకునే అవకాశం దొరుకుతుంది.
  • స్వచ్ఛంద సంస్థలో చేరండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మీకు సంతృప్తినిస్తుంది. మీ ఒంటరితనాన్ని దూరం చేయడమే కాదు మంచి ఆలోచనా ధోరణిని అలవాటు చేస్తుంది కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్