చిన్న వయసులోనే యవ్వనమా?

సాధారణంగా అమ్మాయిలు 12 లేదా 15 ఏళ్ల మధ్యలో రజస్వల అవుతుంటారు. కానీ ప్రస్తుతం చాలామంది పదేళ్లలోపే అవుతున్నారు. ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం... పలు అధ్యయనాల ప్రకారం అధిక బరువే యవ్వనం త్వరగా పలకరించడానికి కారణమట.

Published : 11 Mar 2024 02:13 IST

సాధారణంగా అమ్మాయిలు 12 లేదా 15 ఏళ్ల మధ్యలో రజస్వల అవుతుంటారు. కానీ ప్రస్తుతం చాలామంది పదేళ్లలోపే అవుతున్నారు. ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం...

లు అధ్యయనాల ప్రకారం అధిక బరువే యవ్వనం త్వరగా పలకరించడానికి కారణమట. బయట దొరికే ఫాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ఫుడ్‌లను తరచూ తినడం, తరవాత ఎటువంటి వ్యాయామాలు చేయకపోవడం వల్ల అదంతా కొవ్వు రూపంలో నిల్వ ఉండి చివరికి ఊబకాయానికి దారితీస్తుంది. ఇదే చిన్న వయసులో రజస్వల అవ్వడానికీ ప్రధాన కారణం అవుతోంది.

  • టెక్‌ పరిచయం చేయాలి, వెనకబడొద్దంటూ పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి కూర్చుంటున్నాం. వాళ్లేమో గంటల తరబడి ఆ తెరలకు అతుక్కుపోతున్నారు. ఆటలు, కథలంటూ వాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కానీ సెల్‌ఫోన్‌ నుంచి వచ్చే రేడియేషన్‌ నాడీ వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. అంతేకాదు, దీని కారణంగా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి పెరిగి రజస్వల అవుతుంటారు.
  • పప్పులు దాయాలన్నా, ఫ్రిజ్‌లో ఏవైనా పెట్టాలన్నా ప్లాస్టిక్‌ డబ్బాలు, ప్యాకెట్లేగా మన ఎంపిక. కానీ దీని వాడకం బాగా పెరిగిపోయిందన్న విషయాన్నే గమనించడం లేదు. ఇదేమో సూక్ష్మపరిమాణాల్లో ఆహారం ద్వారా శరీరంలోకి చేరి... హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తోంది. ఇదే కాదు తగినంత నిద్రలేకపోయినా ప్రమాదమే అంటున్నాయి అధ్యయనాలు. చిన్న వయసులోనే నెలసరి ప్రారంభం కావడానికి ఇదీ కారణం అవుతుందట. కాబట్టి, జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్