బాస్టిల్‌ డే పరేడ్‌లో తెలుగమ్మాయి!

‘ఎవరో చెప్పింది చేయడం కాదు.. నచ్చిన పనిలో మనస్ఫూర్తిగా ముందుకెళ్లడమే మంచిది’.. అంటోంది భారతీయ వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ పైలట్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధురెడ్డి.

Updated : 15 Jul 2023 05:27 IST

‘ఎవరో చెప్పింది చేయడం కాదు.. నచ్చిన పనిలో మనస్ఫూర్తిగా ముందుకెళ్లడమే మంచిది’.. అంటోంది భారతీయ వాయుసేనకు చెందిన హెలికాప్టర్‌ పైలట్‌ స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధురెడ్డి. ఫ్రాన్స్‌ జాతీయదినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన.. బాస్టిల్‌ డే పరేడ్‌లో భారతీయ వాయుసేన బృందానికి నాయకత్వం వహించారామె..

బాస్టిల్‌ డే పరేడ్‌లో 68 మంది సభ్యులున్న ఐఏఎఫ్‌ బృందానికి స్క్వాడ్రన్‌ లీడర్‌ సింధు నాయకత్వం వహించారు. ‘ఇతరుల గురించి పట్టించుకోవద్దు. మనకు నచ్చిన పని చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇలా పరాయి దేశంలోని ఐఏఎఫ్‌ బృందానికి నాయకత్వం వహిస్తానని అనుకోలేదు. కానీ చిన్నతనంలో బెంగళూరులో ఎయిర్‌షోలో విమానాలను ఆసక్తిగా చూసేదాన్ని. ప్రతిరోజు ఆకాశం వైపు చూస్తూ ఏదో ఒకరోజు నేనూ అలా విమానాలు నడుపుతానని అమ్మకి చెప్పేదాన్ని’ అనే సింధురెడ్డి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో హెలికాప్టర్‌ పైలట్‌. ఆమె ఎంఐ 17ను నడుపుతారు. ఐఏఎఫ్‌లో తొమ్మిదేళ్ల సర్వీసులో దేశవ్యాప్తంగా పలు బేస్‌స్టేషన్‌లలో సేవలందించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని