పెళ్లి విషయంలో పేచీ

నా వయసు 27. నేనో వ్యక్తిని ప్రేమించాను. పెద్దలు కూడా సరే అన్నారు. తను హిందూ, నేను క్రిస్టియన్ని. వాళ్లు రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌ అంటున్నారు. అది దొంగపెళ్లిలా ఉంటుందని బంధువులు అనడంతో అమ్మ భయపడుతోంది. నాన్న నా చిన్నతనంలోనే చనిపోతే అమ్మ నన్నూ, ఇద్దరన్నయ్యలనూ కష్టపడి పెంచింది.

Updated : 31 Jul 2023 15:09 IST

నా వయసు 27. నేనో వ్యక్తిని ప్రేమించాను. పెద్దలు కూడా సరే అన్నారు. తను హిందూ, నేను క్రిస్టియన్ని. వాళ్లు రిజిస్ట్రేషన్‌ మ్యారేజ్‌ అంటున్నారు. అది దొంగపెళ్లిలా ఉంటుందని బంధువులు అనడంతో అమ్మ భయపడుతోంది. నాన్న నా చిన్నతనంలోనే చనిపోతే అమ్మ నన్నూ, ఇద్దరన్నయ్యలనూ కష్టపడి పెంచింది. అందుకే అమ్మని కాదనలేకపోతున్నా..

- ఓ సోదరి

మీరిద్దరూ వేరువేరు మతాలకు చెందినప్పటికీ పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. మంచిదే. పెద్దలు కూడా సమ్మతించారంటే పేచీలేదు. కులమతాలను పట్టించుకోకుండా ఇంతవరకూ వచ్చినవారు.. భవిష్యత్తులో ఎలా గడపాలని ప్రణాళికలు వేసుకోవాలి. అంతేతప్ప కులమతాలు, వాళ్లూ వీళ్లూ ఏమనుకుంటారోనని ఆలోచించకూడదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఇలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇరు కుటుంబాల్లో విభేదాలు రాకుండా చూసుకోండి. జీవితం సజావుగా సాగడం ముఖ్యం తప్ప, ఎలా పెళ్లి చేసుకోవాలో కాదు. అతని కుటుంబీకులకు ఇష్టంలేని విధంగా మీరు, మీ వాళ్లకి నచ్చని తీరులో వాళ్లు తీర్మానాలు చేసుకునే కంటే రిజిస్టర్‌ పెళ్లి చేసుకుని రెండు వైపుల కుటుంబసభ్యులనూ ఆహ్వానించి వేడుక చేసుకోవడమే ఉత్తమం. కలిసి జీవితం మొదలుపెట్టకముందే ఇలాంటి అభిప్రాయ భేదాలు వచ్చాయంటే.. మున్ముందు రెండు కుటుంబాల ఆచార వ్యవహారాలకు సంబంధించిన తేడాలతో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ముందుగానే కూలంకషంగా చర్చించి కుల, మత, ఆచారాల ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. కొందరు బంధుమిత్రులు ఏవో అనుమానాలు లేవదీస్తుంటారు. వంకలు పెడుతుంటారు. వాటితో మీరు బ్యాలెన్స్‌ కోల్పోకూడదు. బంధుమిత్రుల కోసం ఆలోచిస్తూ జీవితాన్ని పాడుచేసుకోవద్దు. ఇలాంటివి చిన్న విషయాలుగా పరిగణించి అధిగమించండి. ఇద్దరూ చదువుకున్నవారే కనుక కుటుంబసభ్యులతో మాట్లాడి సమన్వయం చేసుకోండి. భేదాలు రానీయొద్దు. మీ అమ్మగారికి సర్దిచెప్పండి. అర్థం చేసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్