అతిగా కొనట్లేదు కదా!

రాయితీలు, సులువైన చెల్లింపులు, కూర్చున్న చోటి నుంచే షాపింగ్‌ అవకాశం వెరసి.. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీనికి మూడో ఉద్ధృతి తోడైంది. దీంతో చాలామంది మహిళల ప్రధాన వ్యాపకం షాపింగే అవుతోందట! మరి.. అన్నీ అవసరమైనవే కొంటున్నారా? చెక్‌ చేసుకోండి. అంతర్జాలంలో వార్తల నుంచి వస్తువు వరకు దేనికోసం చూసినా కింద ప్రకటనల రూపంలో కళ్లు చెదిరే రాయితీలు...

Published : 20 Jan 2022 01:02 IST

రాయితీలు, సులువైన చెల్లింపులు, కూర్చున్న చోటి నుంచే షాపింగ్‌ అవకాశం వెరసి.. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. దీనికి మూడో ఉద్ధృతి తోడైంది. దీంతో చాలామంది మహిళల ప్రధాన వ్యాపకం షాపింగే అవుతోందట! మరి.. అన్నీ అవసరమైనవే కొంటున్నారా? చెక్‌ చేసుకోండి.

అంతర్జాలంలో వార్తల నుంచి వస్తువు వరకు దేనికోసం చూసినా కింద ప్రకటనల రూపంలో కళ్లు చెదిరే రాయితీలు. ‘అరె.. చాలా తక్కువ’ అనేసుకుని కొంటుంటాం. తక్కువ సరే! అవసరమా అనేదీ ఆలోచించుకోండి. దేన్నైనా కొనేముందు.. ‘కావాలి అనిపిస్తోందా? కచ్చితంగా కావాలా?’ అని ప్రశ్నించుకోండి. అలాగే ఆదాయం, ఇతర అవసరాలనూ పరిశీలించుకోండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి.

కొందరు ఇంట్లోని వస్తువులు, వ్యాయామానికి సంబంధించిన వాటిని ఇతరులను చూసి కొనేస్తుంటారు. తీరా కొన్నిరోజులు వాడాక పక్కన పెట్టేస్తుంటారు. అదీ వృథానే. ఇది తప్పాలంటే ముందు నచ్చినవాటిని నేరుగా కొనేయకండి. కార్ట్‌లోకి కొట్టి ఉంచండి. కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు తిరిగి చూడండి. ఆ తర్వాతా కొనాలనిపిస్తే తీసేసుకోండి. కొన్నిసార్లు చేతిలో డబ్బులు లేకపోయినా.. కొందరు నియంత్రించుకోలేరు. అలాంటప్పుడు క్రెడిట్‌ కార్డులను పక్కనపెట్టేయండి. అవసరాలు, కావాల్సినవి, పొదుపు.. మూడు రకాలుగా బడ్జెట్‌ నిర్ణయించుకోవాలి. ఎంత కష్టమైనా దాన్ని పాటించేలా చూసుకోండి. ఫోన్‌ నుంచి అతిగా ఉన్న ఈ-కామర్స్‌ ఆప్‌లనూ తొలగించండి. ఒత్తిడి వల్ల కూడా కొనేస్తుంటారు కొందరు. అదీ కారణమేమో ఒకసారి సమీక్షించుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్