బాత్రూం కూడా ఆహ్లాదంగా...

కొందరి ఇళ్లలో వంటిల్లు, డైనింగ్‌ హాలు, పడకగది ఎంత అందంగా, ఆహ్లాదంగా ఉంటాయో బాత్రూం కూడా అంతే పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలా ఉంచడంలో ఇల్లాలి పాత్రే అధికమంటే అతిశయోక్తి కాదు. అలా ఉంచే ప్రయత్నంలో ఆమె తీసుకునే జాగ్రత్తలు ఇవీ...

Published : 18 Feb 2022 01:19 IST

కొందరి ఇళ్లలో వంటిల్లు, డైనింగ్‌ హాలు, పడకగది ఎంత అందంగా, ఆహ్లాదంగా ఉంటాయో బాత్రూం కూడా అంతే పరిశుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అలా ఉంచడంలో ఇల్లాలి పాత్రే అధికమంటే అతిశయోక్తి కాదు. అలా ఉంచే ప్రయత్నంలో ఆమె తీసుకునే జాగ్రత్తలు ఇవీ...

* అరిగిపోయిన సోపు ముక్కలు, అయిపోయిన షాంపూ సాచెట్లు లేదా బాటిళ్లు, వెంట్రుకల తుట్టులు లాంటి చెత్తాచెదారం ఏదీ బాత్రూంలో మిగలనీయకుండా వెంటనే వాటిని తీసేయాలి. డస్ట్‌బిన్‌లో సైతం చెత్త పేరుకుపోనివ్వకుండా కవరును ఏ రోజుకారోజు పడేయాలి.

* తల స్నానం చేసి జుట్టును శుభ్రపరచుకున్నట్టే గోడలకు కూడా షవర్‌ బాత్‌ చేయించాలి. ఇదేం చోద్యం అనుకుంటున్నారా! మగ్గుడు నీళ్లలో ఒక చెంచా వెనిగర్‌ వేసి గోడలు కడిగేస్తే సరి మిలమిలా మెరుస్తాయి.

* స్నానం చేసి తుడుచుకున్న టవల్‌ను ఎండపొడ తగిలేలా ఆరబెడతారు. బయటికెళ్తున్నాం.. అలా కుదరదు అనుకున్నప్పుడు హెయిర్‌ డ్రయర్‌తో వెంటనే ఆరేలా చేస్తారు. లేదంటే ముంజువాసన రావడమే కాదు, చూడటానికీ బావుండదు.

* వాష్‌ రూం వాడిన ప్రతిసారీ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ వేయడం మర్చిపోరు. లోపలి గాలి బయటకు వెళ్లడం వల్ల తాజాదనం అనుభూతికి వస్తుంది.

* బాత్రూంను ఎప్పటికప్పుడు కడిగేస్తే మకిలి పేరుకుపోదు. కాస్త బేకింగ్‌ సోడా వేసి కడిగితే సులువుగా, శుభ్రంగా పని ముగుస్తుంది. అలాగే తడి లేకుండా మోప్‌ స్టిక్‌తో తుడిచేస్తే వాష్‌రూంలో గాక మరేదో గదిలో ఉన్నట్టే ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్