ఏడాదంతా పూతే!

కంటి ముందు పచ్చదనం ఎవరికిష్టం ఉండదు. ఆకుపచ్చని రంగు మనసుకు హాయితో పాటు కంటికి ఆరోగ్యాన్నీ ఇస్తుంది. అంతేనా స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందిస్తాయి. ఇన్ని సుగుణాలుండటం వల్లే

Updated : 06 Apr 2022 01:28 IST

కంటి ముందు పచ్చదనం ఎవరికిష్టం ఉండదు. ఆకుపచ్చని రంగు మనసుకు హాయితో పాటు కంటికి ఆరోగ్యాన్నీ ఇస్తుంది. అంతేనా స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందిస్తాయి. ఇన్ని సుగుణాలుండటం వల్లే మొక్కలను పెంచుకుంటాం. అయితే మరొక సుగుణం ఉన్న మొక్కలున్నాయి. అవేనండీ ఏడాదంతా పూస్తూ పరిమళాలు వెదజల్లే పూల మొక్కలు. మరి అవేంటో చూద్దామా...

మందారాలు.. ఎర్రటి ఈ పూలు చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. పెరటికి కొత్త కళను తెస్తాయివి. ఎరుపే కాకుండా పసుపు, తెలుపు, గులాబీ... ఇలా బోలెడు హైబ్రీడ్‌ రకాల్లోనూ పూస్తాయి. వీటిని పెంచడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. అయితే అప్పుడప్పుడూ తెల్ల పురుగు ఇబ్బంది పెడుతుంది. అలాంటప్పుడు చెంచాడు షాంపూను లీటర్‌ నీళ్లలో కలిపి పిచికారీ చేస్తే చాలు. ఈ పూలు ఏడాదంతా పూస్తూనే ఉంటాయి.

కెన్నా లిల్లీ... ఈ మొక్క పూలూ, ఆకులు పెద్దగా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఎరుపు, గులాబీ, కమలాపండు రంగు, లేత గోధుమ.. ఇలా రకరకాల రంగుల్లో సందడి చేస్తాయి. మీ పెరట్లో నిత్యం పూలు పూయాలంటే ఈ మొక్కను తెచ్చుకోండి.

చంపా... పూల మీద తేనె ఒలికినట్లు... లేత పసుపు, గంధం రంగుల కలయికతో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇళ్లు, కార్యాలయాలు, పార్కులు... ఇలా చాలా చోట్ల ఇవి కనిపిస్తాయి. హైబ్రిడ్‌లో బోలెడు రంగులుంటాయి.

గులాబీ... పూలలో రారాజు, ప్రేమ సంకేతం... ఇలా దీనికి ఎన్ని పేర్లో... తెలుపు, ఎరుపు, పసుపు రంగుల్లోనే కాదు... నీలం, నలుపు, ఆరెంజ్‌ రంగుల్లోనూ లభ్యమవుతాయి. తగినన్ని నీళ్లు కొద్దిగా ఎరువు ఉంటే చాలు ఏడాదంతా రంగుల గులాబీలు పూస్తూనే ఉంటాయి.    

బోగన్‌ విలియా... కాగితం పూలని పిలుస్తారు. వీటిలో బోలెడు రకాలున్నాయి. దీనికి నీళ్లు, ఎరువులు లాంటి సంరక్షణా చర్యలు పెద్దగా అవసరం లేదు. ఆధారం ఉంటే అల్లుకుపోతుంది. ఏడాదంతా పూస్తూనే ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్