పిల్లల గది అదిరిపోయేలా..!

పిల్లల ఆలోచనలూ, వ్యక్తిత్వం, సంతోషం, సృజనాత్మకత... అంశాల్లో వాళ్ల గది వాతావరణానికీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే దాన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దాలి. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా... ఇలా చేసి చూడండైతే! 

Published : 04 May 2022 01:16 IST

పిల్లల ఆలోచనలూ, వ్యక్తిత్వం, సంతోషం, సృజనాత్మకత... అంశాల్లో వాళ్ల గది వాతావరణానికీ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే దాన్ని ఎంతో ప్రత్యేకంగా తీర్చిదిద్దాలి. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా... ఇలా చేసి చూడండైతే! 

బుడిబుడి అడుగుల బుడతలకే కాదు, అయిదారేళ్ల పిల్లలకూ జంతువులూ, పక్షులపైన ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. సవన్నా, సఫారీ పేర్లతో ఇలాంటి వాల్‌పేపర్లు వస్తున్నాయి. వాటిని గోడమీద అంటించొచ్చు. జంతువుల బొమ్మలున్న ఫర్నిచర్‌, వస్తువులూ గదికి అందం తెస్తాయి. 

బడి ఈడు పిల్లల గదిలో సృజనాత్మకత కనిపించాలి. రంగులు వెదజల్లినట్టు ఉండే కన్‌ఫెట్టి డిజైన్లని గోడలకి ఎంచుకోవచ్చు. అలాగే బెడ్‌లు కూడా ఆకారాల్లో, రంగుల్లో ఆకర్షణీయంగా, భిన్నంగా ఉండేట్టు చూడాలి. 

ప్రయాణాలంటే ఇష్టపడుతున్నా, వారిలో అటువంటి ఆలోచనలు తేవాలన్నా ప్రపంచ పటం వాల్‌పేపర్‌గా ఉంటే బావుంటుంది.

చుక్కలూ, వృత్తాలూ, త్రిభుజాల్లాంటి స్టిక్కర్లు పిల్లలకు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని అతికించి గోడలూ, ఫర్నిచర్‌నీ ఆకర్షణీయంగా మార్చొచ్చు. జలచరాలు ఇష్టపడే వాళ్లకి ఆ తరహా స్టిక్కర్లని తలపులూ, అల్మరాలకు అతికించవచ్చు. 

వాళ్ల ఫేవరెట్‌ కార్టూన్‌, కథల్లోని పాత్రల స్టెన్సిల్‌ ఆర్ట్‌నీ అతికించవచ్చు. బెడ్‌ షీట్లు, కుషన్‌ కవర్లు కూడా ఈ తరహాలో ఉంటే బావుంటాయి. 

బంక్‌ బెడ్‌ ఎప్పటికీ నిలిచే ఫ్యాషన్‌. మల్టీ లెవెల్‌ ప్లే బంక్‌ అయితే కిందన ఆడుకోవడానికి చోటుంటుంది. ఇద్దరు పిల్లలుంటే పైనా కిందనా బెడ్‌లు ఉండేవి ఎంచుకోవాలి.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్