ప్లాస్టిక్‌కు బదులుగా...

పాలిథిన్‌ కవర్లూ, ప్లాస్టిక్కూ, ఆ వ్యర్థాలు వందల సంవత్సరాలైనా కరగకుండా పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నా నిర్లిప్తంగా ఉండిపోతున్నాం. నిజానికి మనం తలచుకోవాలే గానీ ప్లాస్టిక్‌ వాడకాన్ని భేషుగ్గా తగ్గించగలం.

Published : 28 Jul 2022 01:57 IST

పాలిథిన్‌ కవర్లూ, ప్లాస్టిక్కూ, ఆ వ్యర్థాలు వందల సంవత్సరాలైనా కరగకుండా పర్యావరణాన్ని కలుషితం చేస్తాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నా నిర్లిప్తంగా ఉండిపోతున్నాం. నిజానికి మనం తలచుకోవాలే గానీ ప్లాస్టిక్‌ వాడకాన్ని భేషుగ్గా తగ్గించగలం. ఇదొక నియమంగా పెట్టుకుందాం. ఒక్కసారే మొత్తాన్నీ నిరోధించలేకున్నా క్రమంగా తగ్గిద్దాం. మొదట ఈ తేలికైన పద్ధతులను అనుసరిద్దాం...

* వస్త్రం లేదా నారతో తయారైన సంచితోనే మార్కెట్టుకు వెళ్తే పాలిథిన్‌ కవర్లను వదిలించుకున్నట్టే. హ్యాండ్‌బ్యాగ్‌లో చేసంచులు అదనంగా ఉంచుకుంటే మర్చిపోయే ప్రసక్తే ఉండదు.

* కొత్తిమీర, గోంగూర, తోటకూర లాంటి ఆకుకూరలను పాలిథిన్‌ కవర్లలో భద్రపరిచే బదులు ఒక పాత్రలో నీళ్లు పోసి వేళ్లు మునిగేలా ఉంచండి. నాలుగైదు రోజులు నిలవుంటాయి.

* ఇంటికొచ్చిన తర్వాతైనా కూరగాయలను కవరులో ఉంచాలిగా అంటారా? వాటికీ మార్గాలున్నాయి. బ్రెడ్డును శుభ్రమైన వస్త్రంలో ఉంచి చెక్క బ్రెడ్‌ బిన్‌లో ఉంచండి.

* బీన్స్‌, బఠాణీ, గోరుచిక్కుడు తదితరాలను ప్లాస్టిక్‌ కవరులో ఉంచే బదులు తడిబట్టలో చుడితే కాలుష్యం ఉండదు, తాజాగా ఉంటాయి.

* తేనెతుట్టె మైనంతో తయారైన పెట్టె లేదా తొడుగు దొరుకుతుంది. దాన్ని తెచ్చుకున్నారంటే కొన్ని కూరగాయలను అందులో భద్రం చేయొచ్చు.

* కరివేపాకును తడి లేని గాలి చొరబడని సీసాలో ఉంచితే పదిరోజుల వరకూ పాడవదు.

* ఉల్లిపాయలను ప్లాస్టిక్‌ బుట్టకు బదులు ఒక మూల పేపరు పరిచి ఆరబోయండి.

* శీతల పానీయాల సీసాలతో అత్యధిక ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతోంది. పైన సీసా, లోపలి ద్రావకం రెండూ హానికరమే కనుక వాటి జోలికి వెళ్లొద్దని మనకి మనమే ఆంక్ష విధించుకుంటే మన వంతు వాడకం తగ్గించినట్టే. ఇలా ఎందరు చేయగలిగితే అంత కాలుష్యం హరిస్తుంది.

* ప్లాస్టిక్‌ నివారణకు మరి కొన్ని సూత్రాలు మరోసారి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్