ఏ ఉప్పు మేలు?
రాక్, పింక్, బ్లాక్ సాల్ట్ ఇలా రకరకాల ఉప్పులు వస్తున్నాయి. ఎవరికి నచ్చింది వాళ్లు వాడుతున్నారు. అసలు వీటిల్లో ఏది మంచిది. అన్నింటిల్లోనూ పోషకవిలువలు ఉంటాయా?
రాక్, పింక్, బ్లాక్ సాల్ట్ ఇలా రకరకాల ఉప్పులు వస్తున్నాయి. ఎవరికి నచ్చింది వాళ్లు వాడుతున్నారు. అసలు వీటిల్లో ఏది మంచిది. అన్నింటిల్లోనూ పోషకవిలువలు ఉంటాయా?
- రాధ, వైజాగ్
సాధారణంగా ఒక వ్యక్తి రోజులో 5 గ్రా. ఉప్పు తినొచ్చు. పోషక విలువల విషయానికొస్తే సాల్ట్‌లో కొంత మోతాదులో సోడియం క్లోరైడ్ ఒకటే ఉంటుంది. మన దేశంలో నివసించే వారిలో అయోడిన్ లోపం ఎక్కువ. దాంతో గాయిటర్ సమస్య అధికంగా ఉండేది. అందుకే వంటకు వాడే ఉప్పులో అయోడిన్ కలపడం తప్పనిసరి చేశారు. ఇప్పటిదాకా అందరం దాన్నే వాడుతూ వచ్చాం. ఇక ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న ఉప్పుల గురించి తెలుసుకుందాం. హిమాలయన్ పింక్‌సాల్ట్.. ఇది హిమాలయాల్లో ఎండిపోయిన చెరువుల్లో రాళ్ల నుంచి సేకరిస్తారు. దీనిలో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల గులాబీ రంగులో ఉంటుంది. కొద్ది మొతాదులో జింక్, కాల్షియం, మాంగనీస్ లాంటివి ఇందులో ఉంటాయి. బ్లాక్ సాల్ట్.. ఉత్తర భారతదేశంలోని హరియాణాలో చెరువుల నుంచి దీన్ని సేకరిస్తారు. సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఆ రంగూ, వాసన వస్తుంది. దీన్ని బొగ్గుల బట్టీ పై వేయిస్తారు. రుచి కోసం ఉసిరి లాంటివి కలుపుతారు. దీన్ని తయారీ విధానం, సల్ఫర్ అధికంగా ఉండటం వల్ల దీనికా రుచి వస్తుంది. ఆయుర్వేద చికిత్సల్లోనూ వాడతారు. శాస్త్రీయంగా చూస్తే శుభ్రపరచి, అయోడిన్ కలిపిన ఉప్పు మాత్రమే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.