కళ్లు తిరిగే కార్పెట్లు...

ఇంటి మధ్యలో ఇది ఉంటే అడుగు పెట్టడానికి ఆలోచిస్తాం. అగాధంలోకి జారతామని బెదురుతాం. గోడపై ఈ డిజైన్‌ ఉంటే... దూరంగా కనిపించేవన్నీ నిజమే అనుకుంటాం.

Published : 18 Mar 2024 01:57 IST

ఇంటి మధ్యలో ఇది ఉంటే అడుగు పెట్టడానికి ఆలోచిస్తాం. అగాధంలోకి జారతామని బెదురుతాం. గోడపై ఈ డిజైన్‌ ఉంటే... దూరంగా కనిపించేవన్నీ నిజమే అనుకుంటాం. మనింట్లోనే మనల్ని ఇలా కనికట్టు చేసేవి ఏంటా అని ఆలోచిస్తున్నారా.. అవేంటో తెలుసుకుందాం.

భ్రమపరుస్తూ...: ఎదురుగా లోతైన గుంతలా అనిపించేలా చేస్తుంది ఈ 3డీ కార్పెట్‌. ముందుకు అడుగేస్తే లోతుగా ఉన్న దాంట్లో జారిపోతామనే భ్రమను కల్పిస్తుంది. గది మధ్యలో, సోఫాకెదురుగా పరిచే రకరకాల డిజైన్లలో ఈ ఇల్యూజన్‌ కార్పెట్లు ఇంటిని ఆకర్షణీయంగా మార్చేస్తున్నాయి.

నలుపు, తెలుపు, నీలం వంటిరంగుల్లోనే కాకుండా ఇంద్రధనుస్సులా పలువర్ణాల కలయికలోనూ మెరిసిపోతూ...ముందుగదికి కొత్త అందాలను తెచ్చిపెడుతున్నాయి. అలాగే గదిలో వెలుతురు పడే చోట 3డీ టన్నెల్‌ రగ్‌ పరిస్తే చాలు. ఇతర అలంకరణ అవసరం ఉండదనిపించేలా ఆ ప్రాంతాన్ని మార్చేస్తుంది. 

నిజమనిపించేలా..: మంచంపై పరిచే దుప్పట్లకు ఈ 3డీ హంగులొచ్చాయిప్పుడు. వివిధ రంగుల్లో కనువిందు చేస్తూ ఈ డిజైన్లు భ్రమలోకి జారేలా చేస్తున్నాయి. ఇక వాల్‌ మ్యూరల్‌ డిజైన్లు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. నాలుగ్గోడల మధ్య ప్రకృతి దృశ్యాలు, అందమైన నిర్మాణాలను మనసుకు అతిదగ్గరనిపించేలా ఉంచుతున్నాయి. గుహలా అనిపించే వాల్‌ పేపర్‌ రంగుకు తగ్గ మ్యాచింగ్‌ ఫర్నిచర్‌ను సర్దితే చాలు. గది అందం పెరిగినట్లే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్