వేసవిలో ఇల్లు చల్లగా...

ఎండాకాలం వచ్చిందంటే చాలు... ఉక్కపోత మొదలవుతుంది. బయట ఉష్ణోగ్రతలకు ఇంటిలో ఏసీలూ, కూలర్లు ఉన్నా ఇంకా వేడిగా అనిపిస్తుంటుంది. మరి ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు..

Published : 19 Mar 2024 01:09 IST

ఎండాకాలం వచ్చిందంటే చాలు... ఉక్కపోత మొదలవుతుంది. బయట ఉష్ణోగ్రతలకు ఇంటిలో ఏసీలూ, కూలర్లు ఉన్నా ఇంకా వేడిగా అనిపిస్తుంటుంది. మరి ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు..

  • వేసవిలో ఇంట్లో ఉండే కిటికీలన్నీ మూసి ఉంచితే లోపలికి వెలుతురూ, గాలీ సరిగా రాదు. ఉక్కపోతగానూ ఉంటుంది. అలాగని రోజంతా తెరిచి ఉంచమని కాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆ పని చేస్తే గది చల్లబడుతుంది. కిటికీ నుంచి దోమలు, పురుగులు రాకుండా మెష్‌లను అమర్చుకుంటే సరి.
  • ఇల్లు చల్లగా ఉంటే సరిపోదు.. ఫర్నిచర్‌ కూడా దానికి తగ్గట్లు ఉండాలి. చాలామంది సోఫా, మంచాలపై వేసే క్లాత్‌లు అందంగా కనిపించాలని ముదురు రంగు వాటిని ఎక్కువగా వాడుతుంటారు. ఇవి అధిక వేడిని గ్రహిస్తాయి. అందుకే వేసవిలో వీలైనంత వరకూ లేత రంగుల్ని ఎంచుకుంటే సరి. ఇవి ఇంటిని చల్లగా ఉంచుతాయి. వీటిల్లోనూ సిల్క్‌ కాకుండా కాటన్‌ వంటివాటిని ఎంచుకుంటే బాగుంటుంది.
  • వేసవి తాపాన్ని తగ్గించడంతో పాటు ఆక్సిజన్‌ స్థాయిని పెంచేందుకు ఇంట్లో కొన్ని రకాల మొక్కలను పెంచితే మేలు. కలబంద, స్నేక్‌ ప్లాంట్‌, బేబీ రబ్బర్‌, అరేకా పామ్‌ ప్లాంట్‌... వంటివి ఇంటిని చల్లగా ఉంచడమే కాదు సువాసననూ అందిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్