వంటపని తేలిగ్గా చేసేద్దాం...

కొన్ని చిన్న పరికరాలైనా సరే... వంటింటి పనిని సులభతరం చేయడమే కాదు, చాలా సమయాన్నీ ఆదా చేస్తాయి. అటువంటి వాటిల్లో ఇవి కొన్ని. చూసేయండి మరి!

Published : 20 Mar 2024 01:23 IST

కొన్ని చిన్న పరికరాలైనా సరే... వంటింటి పనిని సులభతరం చేయడమే కాదు, చాలా సమయాన్నీ ఆదా చేస్తాయి. అటువంటి వాటిల్లో ఇవి కొన్ని. చూసేయండి మరి!


వంటింటి వ్యర్థాలకు...

గిన్నెలు తోమేటప్పుడు ఒక్కోసారి వాటిలో అన్నం, మిగిలిపోయిన కూరలూ, కూరగాయల తొక్కలు... లాంటి వంటింటి వ్యర్థాలన్నీ ఉంటాయి. వాటిని అలాగే పడేస్తే సింక్‌ పైపు పాడవ్వడమే కాదు, చిందరవందరగానూ కనిపిస్తుంది కదా! దీనికి పరిష్కారంగా వచ్చిందే సింక్‌ స్ట్రెయినర్‌ బాస్కెట్‌. దీన్ని ఏ రకం సింకులకైనా తేలిగ్గా అమర్చుకోవచ్చు. ఎక్కువ స్థలమూ అవసరం లేదు. శుభ్రపరచుకోవడమూ తేలికే. దీనికి డిస్పోజబుల్‌ రిప్లేస్‌మెంట్‌ బ్యాగులూ వస్తాయి. కావాల్సినప్పుడు మార్చుకుంటే సరి. పైగా దృఢమైన నెట్‌ ఉండడంతో ఎక్కువ చెత్తనూ మోయగలదిది.  


తీయడం తేలికే...

జామ్‌, పీనట్‌ బటర్‌, తేనె... లాంటివి నిత్యం కొంటూనే ఉంటాం. కానీ వాటి మూతలే ఓ పట్టాన రావు. తీసే క్రమంలో ఒక్కోసారి చేతులూ కోసుకుపోతుంటాయి. అలాకాకుండా ఉండాలంటే ఈ జార్‌ ఓపెనర్‌ను తెచ్చేసుకోండి. ఒకే పరికరంలో నాలుగు రకాల సైజుల్లో ఓపెనర్లు ఉంటాయి. దీంతో ఎక్కువ శ్రమ లేకుండా తేలిగ్గా జార్‌ల మూతలు తీసుకోవచ్చు.


కజ్జికాయలకే ప్రత్యేకం...

తెలుగు వాళ్ల పండగల్లో కజ్జికాయలది ప్రత్యేక స్థానం. అయితే వాటిని ఎవరి సాయం లేకుండా చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా! అందుకే ఈ కజ్జికాయల మేకర్‌ను తెచ్చేసుకోండి. పిండిని ముద్దగా కలిపాక, ఓ చిన్న ముద్దను తీసుకుని దీన్లో ఉండే పూరీ మేకర్‌తో గట్టిగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత స్టఫ్‌ను పెట్టేసి, మౌల్డ్‌లో ఉంచి ఒత్తేసుకుంటే సరి. కజ్జికాయ ఆకారంలో వచ్చేస్తుంది. ఆ తరవాత వీటిని నూనెలో వేయించుకోవచ్చు. దీని సాయంతో ఒక్కరే తేలిగ్గా తయారుచేసుకోవచ్చు కూడా. బావుంది కదూ!


చిటికెలో పాన్‌కేక్స్‌...

పిల్లలు స్కూలు నుంచి రాగానే వాళ్లకి ఏవో ఒక స్నాక్స్‌ అందించాలి. ఎక్కువ సమయం పట్టకుండా అప్పటికప్పుడు పాన్‌కేక్స్‌, మఫిన్స్‌, కప్‌కేక్స్‌... లాంటివి చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. అందుకోసం పాన్‌కేక్‌ బ్యాటర్‌ డిస్పెన్సర్‌ ఉంటే మన పని ఇంకా తేలిక. కావాల్సిన పదార్థాలన్నింటినీ ఈ బాటిల్‌లో బ్లెండర్‌ బాల్‌తో సహా వేసి, షేక్‌ చేస్తే చాలు. బ్లెండర్‌ పదార్థాలన్నింటినీ చక్కగా కలిపేస్తుంది. చేతికి కొంచెం కూడా అంటుకోకుండా క్షణాల్లో తయారైపోతుంది. దాన్ని కావాల్సిన ఆకారంలో వేసేసుకుంటే పాన్‌కేక్స్‌ రెడీ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్