ఏ వయసులో ఎలా?

ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం పెద్ద సవాలు. గారాబంగా పెంచితే మాట వినడం లేదనీ, అలాగని కాస్త కఠినంగా వ్యవహరిస్తే మరింత మొండిగా తయారవుతున్నట్లూ చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు.

Updated : 22 Mar 2024 13:19 IST

ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం పెద్ద సవాలు. గారాబంగా పెంచితే మాట వినడం లేదనీ, అలాగని కాస్త కఠినంగా వ్యవహరిస్తే మరింత మొండిగా తయారవుతున్నట్లూ చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. అందుకే, వారినెలా చక్కదిద్దాలో తెలియక తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారట. ఈ ఇబ్బంది తలెత్తకుండా వారిని ఏ వయసులో ఎలా పెంచాలో చెబుతున్నారు నిపుణులు.

  • ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. అలాగని వారిని నియంత్రించడానికి కొట్టడం, తిట్టడం, శిక్షలు వేయడం వంటివి చేస్తే మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వారితో సున్నితంగా ప్రవర్తించాలి. అర్థమయ్యేలా చెప్పాలి.
  • ఐదేళ్ల నుంచి పదమూడేళ్ల పిల్లలు ఎదుటివారిని ఎక్కువగా గమనిస్తుంటారు. వాటిని తిరిగి అనుకరిస్తుంటారు. అందుకే ఈ వయసులోనే వారికి మంచి అలవాట్లు నేర్పించాలి. మంచిచెడులను బోధిస్తూ పెంచాలి. కుటుంబంలో ఎవరైనా వారి ముందు చెడుగా ప్రవర్తించినా భవిష్యత్తులో వారూ అదే చేయాలనుకుంటారు. అందుకే ఈ వయసులో పిల్లల ముందు ఆలోచించి మాట్లాడాలి. ఆచితూచి నడుచుకోవాలి.
  • ఇక టీనేజ్‌కి వచ్చేసరికి వారికి ప్రతి విషయం అర్థమవుతుంది. ఈ వయసులోనే వారితో స్నేహంగా ఉండాలట. ఆర్థిక విషయాలు, కుటుంబ పరిస్థితులు, ప్రేమ వ్యవహారాలు ఇలా సమాజంలో జరిగే ప్రతీ విషయాన్ని వారికి అర్థమయ్యేలా ఉదాహరణలతో వివరించాలట. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వారికి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఎటువంటి మోసాలకు లోనుకాకుండా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్