ఇనుప కడాయిలో ఇవొద్దు!

ఆరోగ్యం కోసమని చాలామంది మళ్లీ ఇనుప కడాయిని ఎంచుకుంటున్నారు. మీరూ అంతేనా? దానిలోనూ కొన్ని పదార్థాలను వండొద్దని తెలుసా? అవేంటంటే...

Published : 27 Mar 2024 01:14 IST

ఆరోగ్యం కోసమని చాలామంది మళ్లీ ఇనుప కడాయిని ఎంచుకుంటున్నారు. మీరూ అంతేనా? దానిలోనూ కొన్ని పదార్థాలను వండొద్దని తెలుసా? అవేంటంటే...

  • టొమాటో, చింతపండు వంటి పుల్లని పదార్థాలు వండొద్దని తెలుసు కదా! వెనిగర్‌, నిమ్మ, టొమాటో సాస్‌లు వాడే ఆహారాలకీ ఇది సరిపడదు. ఇంకా ఆ జాబితాలోకి ఆకుకూరలు, మష్రూమ్‌లు కూడా వస్తాయి. ఇవి సున్నితంగా ఉంటాయి. త్వరగా అడుగంటుతాయి కూడా. అంతేకాదు... దీని నుంచి వచ్చే అతివేడికి పోషకాలూ పోతాయి. తినీ ప్రయోజనం ఉండదు. అందుకే వీటినీ వండొద్దు.
  • చేపలు, సముద్ర ఆహారమేదైనా దీనిలో వండకపోవడమే మంచిది. ఇవీ వండే క్రమంలో పాత్ర అడుగు భాగాన అతుక్కుపోతాయి. నూనె, నెయ్యి ఎక్కువ మొత్తంలో వాడినా ప్రయోజనం ఉండదు. నూనె అతిగా అవ్వడమే కాదు, రుచీ మారిపోతుంది. అన్నం, పాస్తాలకీ ఈ సూత్రం వర్తిస్తుంది. పైగా వీటిల్లోని నూనెలు ఇనుముతో చర్యనొందుతాయి. అందుకే వీటికీ ఇనుప కడాయి సరికాదు.
  • ఆమ్లెట్‌, కోడిగుడ్డు పొరటు, స్వీట్లు... సిద్ధం చేయడానికీ ఇనుప కడాయి మంచి ఎంపిక కాదు. వీటి తాలూకూ వాసనలు ఇనుమును త్వరగా పట్టేస్తాయి. ఎంత శుభ్రంగా కడిగినా త్వరగా వదలవు. తర్వాత వండేవాటికి పట్టి, వాటి రుచిపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు గుడ్లలోని సల్ఫర్‌ ఇనుముతో చర్య పొందుతుంది. రుచిపై ప్రభావం చూపడంతోపాటు అది త్వరగా సిలుము పట్టేలా చేస్తుంది. అందుకే వీటిని సిద్ధం చేసేప్పుడు వేరే పాత్రలను ఎంచుకోమంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్