Published : 11/07/2021 00:30 IST

కొవిడ్‌ వితంతువులకు శిక్షణ...

కొవిడ్‌ సోకడంతో పెద్ద దిక్కును కోల్పోయి ఎన్నో కుటుంబాలు సంక్షోభంలో కూరుకు పోయాయి. భర్తలు చనిపోతే, చదువు లేక ఇంట్లో వాళ్లని ఎలా పోషించుకోవాలో తెలియని వితంతువులు ఎందరో. ఇటువంటి వారి గురించి ఆలోచించింది దిల్లీకి చెందిన ‘ఇంటర్నేషనల్‌ కెరీర్‌ అండ్‌ కాలేజి కౌన్సిలింగ్‌ (ఐసీ3)’ ఇన్‌స్టిట్యూట్‌. వీరికి వివిధ రంగాల్లో శిక్షణనందించి ఉపాధి కల్పించడానికి సిద్ధమైంది. తొలి దశగా పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆసరాను కోల్పోయిన 500 మంది మహిళలను గుర్తించి, శిక్షణ ఇస్తోంది.

కెరీర్‌ కౌన్సిలర్స్‌గా...

గతేడాది నుంచి పరిశీలిస్తే మహిళలకన్నా పురుషులే ఎక్కువ మంది కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వేల మంది మహిళలు వితంతువులుగా మిగిలారు. తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ బాధ్యతను భుజానికెత్తుకున్న కూతుళ్లు చాలా మంది ఉన్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం వీరికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమే. ఇటువంటి వారి సమస్యలకి శాశ్వత పరిష్కార దిశగా ఐసీ3 ఇన్‌స్టిట్యూట్‌ శిక్షణనివ్వనుంది.

ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు కెరీర్‌ కౌన్సిలింగ్‌లో శిక్షణనందించి పాఠశాలల్లో కౌన్సిలర్స్‌గా నియామకం జరిగేలా చూస్తోంది ‘ఐసీ3 ఇన్‌స్టిట్యూట్‌’. తమ గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు సామాజిక, శారీరక, మానసిక, విద్యా సంబంధిత అంశాల్లో కౌన్సిలింగ్‌ను అందించడానికి ఈ కౌన్సెలర్స్‌ను నియమించేలా ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాదిలోపు 500 మందికి శిక్షణతోపాటు, ఆర్థిక చేయూతనూ అందించనుంది. ఆ తర్వాత పాఠశాలలు సహా పలు విద్యాసంస్థల్లో వారికి శాశ్వత ఉపాధిని కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంది. మొదటి బ్యాచ్‌గా 150 మందికి త్వరలో శిక్షణ ప్రారంభిస్తోంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి