సానుకూల సమాధానాలతో సక్సెస్‌

చేస్తున్న ఉద్యోగం నుంచి మరో సంస్థకు మారాలనుకున్నప్పుడు ప్రత్యేక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సానుకూల సమాధానాలిచ్చి విజయాన్ని దక్కించుకోవాలని సూచిస్తున్నారు..

Updated : 18 Nov 2021 06:11 IST

చేస్తున్న ఉద్యోగం నుంచి మరో సంస్థకు మారాలనుకున్నప్పుడు ప్రత్యేక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సానుకూల సమాధానాలిచ్చి విజయాన్ని దక్కించుకోవాలని సూచిస్తున్నారు..

* బలం...బలహీనత

ఇంటర్వ్యూలో మీ బలం, బలహీనతలను వివరించమంటారు. ముందుగా మీ సామర్థ్యం గురించి చెప్పాలి. పాత సంస్థలో విజయవంతం చేసిన ప్రాజెక్టులు, వాటివల్ల సంస్థకు కలిగిన ప్రయోజనాలను అర్థమయ్యేలా వివరించగలగాలి. అలాగే అసలే బలహీనతలూ లేవనకుండా,  ఏదైనా పనిలో ఓటమి ఎదురైనప్పుడు ముందుగా దాన్ని అంగీకరించలేకపోవడం మీ బలహీనతగా భావిస్తానని ధైర్యంగా చెప్పాలి. ఆ అనుభవంతో తిరిగి కృషి చేసి విజయాన్ని సొంతం చేసుకునే మీ పట్టుదలను వారికి తెలియజేయాలి.

* ఒప్పించగలిగి..

ఈ సంస్థనే ఎందుకు ఎంపిక చేసుకున్నారనే ప్రశ్నకు... ఇందులో స్థానాన్ని సంపాదించగలిగితే కెరియర్‌లో ఉన్నతస్థాయికి చేరుకుంటాననే మీ ఆశాభావాన్ని వివరించాలి. అభివృద్ధితోపాటు ఉద్యోగుల సాధికారత కోసం ఆ సంస్థ రూపొందిస్తున్న ప్రణాళికల ప్రత్యేకతను మీరు గుర్తించినట్లు చెప్పాలి. అలాగే సామాజిక ప్రయోజనాలతో పనిచేస్తున్న ఆ సంస్థ మీకు కెరియర్‌ పరంగానే కాకుండా, మానసిక తృప్తినీ ఇస్తుందని.. చెప్పాలి.

* అనుభవం

పాత సంస్థ గురించి ప్రతికూలంగా మాట్లాడకూడదు. కెరియర్‌లో పైమెట్టుకు వెళ్లాలనే ఆలోచనతోనే కొత్త సంస్థకు మారడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాలి. మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే అవకాశాన్ని అందించాలని కోరాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్