కాబోయే అమ్మ సొగసుకీ..

అమ్మ అయ్యే తరుణంలో చాలామంది చర్మ రక్షణను పక్కన పెట్టేస్తారు. దానికితోడు హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా మెడ నల్లబడటం వంటివి కనిపిస్తుంటాయి. పైగా చలికాలం.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి!

Published : 08 Dec 2021 00:40 IST

అమ్మ అయ్యే తరుణంలో చాలామంది చర్మ రక్షణను పక్కన పెట్టేస్తారు. దానికితోడు హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా మెడ నల్లబడటం వంటివి కనిపిస్తుంటాయి. పైగా చలికాలం.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మరి!

* గర్భం దాల్చినప్పుడు చర్మం సాగుతుంది. దీంతో పొడిబారుతుంది. కాబట్టి, ప్రతిరోజు మాయిశ్చరైజింగ్‌ తప్పనిసరి. మెడ, పొత్తికడుపు, తొడలపై స్ట్రెచ్‌మార్క్స్‌, ముఖంపై పిగ్మంటేషన్‌ వంటివన్నీ నాలుగో నెల నుంచి కనిపిస్తాయి. ప్రసవం తర్వాత కొందరికి నెమ్మదిగా చర్మంలో కలిసిపోయినా, మరికొందరిలో సుదీర్ఘకాలం ఉండిపోతాయి. ముందు నుంచే కొబ్బరి నూనెతో మృదువైన మర్దన చేయడం దీనికి సరైన పరిష్కారం. అలాగే హార్మోన్ల సమస్యకు వైద్యులను సంప్రదించాలి.
* ముఖానికి, ఒంటికి రసాయనాలు లేని ఉత్పత్తులను ఎంచుకోవాలి. రోజుకి రెండుసార్లు కొబ్బరినూనె లేదా బాదం నూనె రాయాలి. ఏడెనిమిది గ్లాసుల నీటిని తాగడం అలవరుచుకుంటే చర్మం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.
* హార్మోన్ల అసమతౌల్యాన్ని తగ్గించుకోవడానికి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఫోలిక్‌యాసిడ్‌ పుష్కలంగా ఉండే ఆకు కూరలు, బ్రకోలీ, సిట్రస్‌ ఫలాలు, బీన్స్‌, అవకాడో, విత్తనాలు, గింజలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకుంటే పిగ్మంటేషన్‌ను తగ్గించుకోవచ్చు. పది నిమిషాలకు మించకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. స్టెచ్‌మార్కులకు విటమిన్‌ ఈ ఆయిల్‌తో చేసే మర్దన మంచి ఫలితాన్నిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్