వంటింటి నేస్తాలివీ!

సర్జికల్‌ స్టీల్‌ పాత్రలూ మొదలైన వాటికి గాజు మూతలు ఇస్తున్న సంగతి తెలిసిందే. వంట ముగిశాక వాటిని ఎక్కడ పెట్టినా పగిలిపోతాయేమో అని కొంచెం భయంగా, బెంగగా ఉంటుంది. ఇప్పుడిక అలాంటి భయం అక్కర్లేదు. ఎంచక్కా లిడ్‌ ఆర్గనైజర్‌ కొనుక్కుంటే సరిపోతుంది.

Updated : 20 May 2022 05:58 IST

లిడ్‌ ఆర్గనైజర్‌

సర్జికల్‌ స్టీల్‌ పాత్రలూ మొదలైన వాటికి గాజు మూతలు ఇస్తున్న సంగతి తెలిసిందే. వంట ముగిశాక వాటిని ఎక్కడ పెట్టినా పగిలిపోతాయేమో అని కొంచెం భయంగా, బెంగగా ఉంటుంది. ఇప్పుడిక అలాంటి భయం అక్కర్లేదు. ఎంచక్కా లిడ్‌ ఆర్గనైజర్‌ కొనుక్కుంటే సరిపోతుంది. కబోర్డ్‌లో పెట్టి మూతలు పగిలిపోతాయేమోనని భయం లేకుండా ఈ లిడ్‌ ఆర్గనైజర్‌లో పెట్టేయొచ్చు. సైజుల వారీగా గాజు మూతలు అందులో ఇమిడిపోతాయి. బాగుంది కదూ! మీరూ కొనేసుకోండి.


చక్లా బెలన్‌ స్టాండ్‌

చపాతీలు చేశాక రొట్టెల రాయి, చపాతీ కర్ర, పెనమూ, పట్టుకారులను ఎక్కడో ఒకచోట సర్దేస్తాం. కానీ అవన్నీ ఒక సెట్టులాగా, ఏ వస్తువుకీ అడ్డు అనిపించకుండా, అవసరమైనప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉండేట్లు వచ్చిందే చక్లా బెలన్‌ స్టాండ్‌. పొందిగ్గా ఉంది కదూ! కర్ర, రాయి అమర్చేశాక ఒక కొక్కానికి పట్టుకారూ, మరోదానికి పెనమూ తగిలించేయొచ్చు. చూపులకు నీట్‌గానూ ఉంది, పెట్టడం, తీసుకోవడం తేలిక కూడా. నచ్చితే ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్