స్నేహితుల దగ్గర ఒకలా... ట్రాఫిక్‌లో మరోలా...

మనం స్నేహితులను కలవడానికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌ జామ్‌ అయిదనుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బా ఈ ట్రాఫిక్‌లో ఎంతసేపూ సమయం గడవదే అనే కదా!

Published : 13 Mar 2024 01:32 IST

మనం స్నేహితులను కలవడానికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌ జామ్‌ అయిదనుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బా ఈ ట్రాఫిక్‌లో ఎంతసేపూ సమయం గడవదే అనే కదా! అదే మరి స్నేహితులతో  సరదాగా ముచ్చట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? అప్పుడే టైమ్‌ అయిపోయిందా! అని కదా. సమయం  ఎప్పుడూ ఒకలానే ఉంటుంది. మరి మనకి ఎందుకు అలా అనిపిస్తుందో తెలుసా!

‘సమయమే డబ్బు’,  ‘సమయాన్ని ఆదా చేయడం, ఖర్చుచేయడం’ లాంటి మాటలు ప్రస్తుత జీవనశైలిలో మనం సమయానికి ఇచ్చే ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఇవి పట్టణ వాతావరణంలో నివసించే వారికి బాగా సరిపోతాయి. ఎందుకంటే వీళ్లు ప్రకృతి సూచనల కంటే ఇంట్లో గడియారాన్ని అనుసరించే రోజువారీ పనులు చేసుకుంటారు కాబట్టి. నిజానికి సమయంపై ఇంతలా ఆధారపడడం, మన ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని టుర్కూ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ‘సమయం సరిపోవట్లేదు’ అనే భావనా ఇందులో నుంచి వచ్చిందేనట. అందుకే నగరాల్లో ఉండేవారు ఎక్కువగా ప్రకృతిలో ఎక్కువ సమయం గడిపేలా చూసుకోవాలి. అప్పుడే మనకు ‘బ్యాలెన్స్‌డ్‌ సెన్స్‌ ఆఫ్‌ టైమ్‌’ వస్తుంది. సహజసిద్ధ వాతావరణంలో ఉండేవారికీ, పట్టణ వాతావరణంలో ఉండేవారికీ సమయాన్ని గడపడంలో తేడా ఉంటుందట. అంతేకాదు కొంతమందిని గతంలో జరిగిన చేదు విషయాలూ, చెడు సంఘటనలూ వర్తమానంలో పదేపదే గుర్తుకు వస్తూ వేధిస్తుంటాయి. అటువంటి వారూ ప్రకృతిలో గడపడం వల్ల వాటినుంచి బయటపడగలుగుతారట. అందుకే మన నగరాలు, పట్టణాలను పార్కులూ, పచ్చదనం ఉండేలా నిర్మించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్