మనసున్న డాక్టరమ్మ!

ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎవరూ ప్రాణాలు వదలకూడదనేది ఆవిడ తపన. అందుకే ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలోనూ రూ.50 లక్షల విరాళం చెక్‌పై సంతకం పెట్టి గొప్ప మనసుని చాటుకున్నారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ యలమంచిలి అరుణకుమారి...

Published : 22 Jun 2021 01:34 IST

మేమున్నాం

ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎవరూ ప్రాణాలు వదలకూడదనేది ఆవిడ తపన. అందుకే ఐసీయూలో చికిత్స పొందుతున్న సమయంలోనూ రూ.50 లక్షల విరాళం చెక్‌పై సంతకం పెట్టి గొప్ప మనసుని చాటుకున్నారు హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ యలమంచిలి అరుణకుమారి...

రుణకుమారి తండ్రి ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌. తల్లి అఖిలాండేశ్వరి. చిన్నప్పుడే తండ్రికి దూరమైన అరుణకుమారి.. తల్లి, అన్నయ్యలతో కలిసి గుంటూరులోని అమ్మమ్మ ఇంటికి వచ్చేశారు. అక్కడ ఎవరికి అనారోగ్యంగా ఉన్నా, దగ్గరుండి మరీ ఆసుపత్రికి తీసుకెళ్లేవారామె. ఆ వైద్యులను చూస్తూ తాను కూడా ఇదే వృత్తిలోకి అడుగుపెట్టాలనుకున్నారు. గుంటూరు వైద్యకళాశాలలో డాక్టరు కోర్సు పూర్తి చేశారు. వృత్తిని దైవంగా భావించే డాక్టర్‌ అరుణకుమారి.. అర్ధరాత్రి సమయంలో కూడా రోగుల వద్దకు వెళ్లి పరామర్శించేవారు. ‘అన్నయ్యను, నన్ను అమ్మ ఒంటరిగానే పెంచింది. మేం కోరిన చదువులు చదివించింది. ఎందరో పేద విద్యార్థులకు ఆర్థికసాయం చేసేది. అలా చిన్నప్పటి నుంచే నాకు సాయం చేసే గుణం అలవడింది. మావారు యలమంచిలి రవికుమార్‌ వ్యాపారి. నా వృత్తిని ఆయన గౌరవించేవారు. అర్ధరాత్రి సమయాల్లో ఆసుపత్రి నుంచి ఫోన్‌ వస్తే ఆసుపత్రికి దగ్గరుండి తీసుకెళ్లేవారు. నేను తిరిగి వచ్చేంతవరకు కారులో ఎదురు చూసేవారు. నాకన్నా ఆయనకు దానగుణం ఎక్కువ. మా దగ్గర పనిచేసే కార్మిక కుటుంబాలన్నింటినీ సొంత వాళ్లనే అనుకునేవాళ్లం. మాకు పిల్లల్లేరు. వాళ్ల పిల్లలే మా పిల్లలయ్యారు. 30ఏళ్లుగా వృత్తిపరంగా వందలమందికి సాయం అందించిన తృప్తి ఉంది. గతేడాది మావారు అనారోగ్యంతో కన్ను మూశారు. బతికున్నంత కాలం తోటివారికి సాయం చేయాలనేది నా కోరిక. ఆక్సిజన్‌ కోసం... విజయవాడ, ఓల్డ్‌ జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారని తెలిసి నావంతు సాయం అందించాలనుకున్నా. అంతలో అనారోగ్యానికి గురయ్యా. ఐసీయూనుంచి వచ్చాక ఇద్దురు అన్నారు. కానీ ప్లాంట్‌ నిర్మాణం ఆలస్యం అవ్వకూడదనుకున్నా. అందుకే ఇక్కడి నుంచే రూ.50 లక్షలు చెక్‌ విరాళంగా అందించా. ఇంకెవరూ కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నా’ అని చెబుతున్నారు 72 ఏళ్ల డాక్టర్‌ అరుణకుమారి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్