మన విలువ చెప్పే... ‘స్వీట్‌ కారం కాఫీ’

పాత తరానికి చెందిన అత్తగారు సుందరి, ఇంటిపని, వంటపని చురుకుగా చేసుకునే ఆమె కోడలు కావేరి, క్రికెటర్‌గా రాణిస్తున్న మనవరాలు నివేదిత... ఇక ఆడవాళ్లంటే ఇల్లు, కుటుంబం తప్ప వారికి వేరే ప్రపంచమే ఉండదంటారు సుందరి కొడుకు రాజారత్నం, మనవడు బాలా.

Updated : 16 Mar 2024 15:17 IST

ఆమె‘చిత్రం’

పాత తరానికి చెందిన అత్తగారు సుందరి, ఇంటిపని, వంటపని చురుకుగా చేసుకునే ఆమె కోడలు కావేరి, క్రికెటర్‌గా రాణిస్తున్న మనవరాలు నివేదిత... ఇక ఆడవాళ్లంటే ఇల్లు, కుటుంబం తప్ప వారికి వేరే ప్రపంచమే ఉండదంటారు సుందరి కొడుకు రాజారత్నం, మనవడు బాలా. మగవారి తోడు లేకుండా ఆడవాళ్లు కనీసం గడప కూడా దాటలేరని వాదిస్తారు. పైగా కుటుంబసభ్యులందరి అవసరాలు తీరుస్తూ.. వారిని కంటికి రెప్పలా చూసుకునే కావేరికి భర్త, కొడుకూ.. ఇద్దరూ విలువ ఇవ్వరు సరికదా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుం టారు. ఇది ఆమెను బాధిస్తూ ఉంటుంది. కానీ తన వేదనను మనసులోనే దాచుకుంటుంది. కుటుంబంలో పెద్దదిక్కు సుందరి పాతతరం మనిషైనా... ఆలోచనలు మాత్రం కొత్త తరానివే. పోతే నివేదిత క్రికెట్‌ ఆడుతుందన్న విషయాన్ని బాయ్‌ఫ్రెండ్‌ తన ఇంట్లో చెప్పకుండా దాచిపెట్టడాన్ని భరించలేకపోతుంది. తన వ్యక్తిత్వాన్ని కించపరచడంతో అవమానపడుతుంది. దీంతో మగవారి కంటే మహిళలేమీ తక్కువకాదని నిరూపించా లనుకుంటారు అత్తా, కోడలు, మనవరాలు. ఇంట్లో చెప్పకుండా గోవా ప్రయాణ మవుతారు. ఈ టూర్‌లో అనుకోని మలుపులు, మూడు తరాల మధ్య అంతరాలు, ఎదురయ్యే అనుభవాలు, ముగ్గురి బలాలు, బలహీనతలతో కథ నడిచే తీరు అందరినీ ఆలోచించేలా చేస్తుంది. సమస్యలెన్నెదురైనా వాటిని ఎదుర్కొనే మహిళల మనోబలం, సహనం కథలో కనిపిస్తాయి. ఆడవాళ్ల తోడు, చేయూత పురుషులకు ఉంటేనే వారు అడుగు ముందుకు వేయగలరని చెప్పిన ‘స్వీట్‌ కారం కాఫీ’ సిరీస్‌ మహిళల మనసు దోచుకుంది. కుటుంబంలో ఏ ఒక్కరూ తక్కువ కాదు.. ఒకరికొకరనే భావన అని చెప్పిన ఈ సిరీస్‌కు దర్శకురాలు స్వాతి రఘురామన్‌తోపాటు బెనాయ్‌ నంబియార్‌, కృష్ణ మారిముత్తు దర్శకత్వం వహించారు. సుందరి పాత్రలో సీనియర్‌ నటి లక్ష్మి, కోడలు కావేరిగా మధుబాల, మనవరాలిగా శాంతి బాలచంద్రన్‌ నటన అందరినీ మెప్పించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్