అమ్మ మనసుతో ఆలోచించి...

కెనడాలో స్థిరపడ్డ భారతీయురాలు టీనాసింగ్‌. ఈమె ముగ్గురు పిల్లల తల్లి. అందరి అమ్మల్లానే తన పిల్లలూ ఆడుకోవడానికి వెళ్తుంటే బోలెడు జాగ్రత్తలు చెప్పేది టీనా.

Published : 23 Mar 2024 01:34 IST

కెనడాలో స్థిరపడ్డ భారతీయురాలు టీనాసింగ్‌. ఈమె ముగ్గురు పిల్లల తల్లి. అందరి అమ్మల్లానే తన పిల్లలూ ఆడుకోవడానికి వెళ్తుంటే బోలెడు జాగ్రత్తలు చెప్పేది టీనా. స్కేటింగో, సైక్లింగో చేస్తుంటే తలకి దెబ్బతగలకుండా హెల్మెట్‌ తప్పనిసరి అని సలహా కూడా ఇచ్చేది. కానీ ఆ పిల్లలకి ఒక్క హెల్మెట్టూ సరిగా అమరేది కాదు. ఎందుకంటే... వాళ్ల సంప్రదాయ పట్కా(పైన ఉండే కొప్పు) ఈ హెల్మెట్లకి అడ్డొచ్చేది. దాంతో టీనాకి పెద్ద చిక్కొచ్చిపడింది. సరిగా అమరడం లేదని హెల్మెట్‌ లేకుండా బయటకు పంపలేని పరిస్థితి. చివరికి తనే చొరవ తీసుకొని హెల్మెట్‌ తయారీ గురించి ఆలోచించింది. పిల్లలకు ఇబ్బంది రాకుండా సైకిల్‌, స్కూటీలు నడిపేటప్పుడు సౌకర్యంగా ఉండటానికీ, స్కేటింగ్‌, హాకీ వంటివి ఆడేటప్పుడు తలకి దెబ్బలు తగలకుండా ఉండేందుకు వీలుగా.. పట్కా అమరేలా బోల్డ్‌ హెల్మెట్‌ని తయారుచేసింది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఐదేళ్లు పట్టినా... ఆదరణ మాత్రం అద్భుతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్