చదవాలంటే ఆర్థిక సమస్యలా..? ఈ స్కాలర్‌షిప్‌ మీ కోసమే..!

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా కొంతమంది చదువుకు దూరమవుతున్నారు. ఇందులో అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా....

Published : 13 Jul 2023 12:30 IST

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా కొంతమంది చదువుకు దూరమవుతున్నారు. ఇందులో అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు. దీనికి వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా కారణమవుతున్నాయి. వీటివల్ల మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా చదువుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ బ్యాంక్‌ ‘పరివర్తన్‌’ పేరిట పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ECSS ప్రోగ్రామ్‌ పేరిట అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. ఇందులో మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.. 

1. పాఠశాల విద్యార్థుల కోసం..

ఈ కేటగిరీలో 1 నుంచి 12 వ తరగతి, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్‌ చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతుండాలి.

ప్రయోజనాలు:

1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు 15 వేల ఆర్థిక సహాయం అందుతుంది.

7, ఆపై తరగతుల విద్యార్థులకు 18 వేల ఆర్థిక సహాయం అందుతుంది.

2. అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల కోసం..

గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీల్లో బీకామ్‌, బీఎస్‌సీ, బీఏ, బీసీఏ వంటి సాధారణ కోర్సులతో పాటు బీటెక్‌, ఎంబీబీఎస్‌, ఎల్‌ఎల్‌బీ, బీ ఆర్క్, నర్సింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదివే విద్యార్థులు ఇందుకు అర్హులు.

ప్రయోజనాలు:

సాధారణ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది.

ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది.

3. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం..

గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకామ్‌ వంటి సాధారణ కోర్సులతో పాటు ఎంటెక్‌, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదివే విద్యార్థులు ఇందుకు అర్హులు.

ప్రయోజనాలు:

సాధారణ పీజీ విద్యార్థులకు 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది.

ప్రొఫెషనల్ కోర్సులలో పీజీ చేసే విద్యార్థులకు 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది.

అర్హతలు:

అభ్యర్థులు అంతకుముందు విద్యా సంవత్సరంలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ ఆదాయం సంవత్సరానికి 2.5 లక్షలకు మించకూడదు.

గత మూడేళ్లుగా వ్యక్తిగత, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకే అధిక ప్రాధాన్యం ఉంటుంది.

అభ్యర్థులు భారత పౌరులై ఉండాలి.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 2023

దరఖాస్తు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఇతర వివరాల కోసం ఈ కింది లింక్‌ని క్లిక్‌ చేయండి.
https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecss-programme

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్