ఆ సమస్యల బారిన పడకుండా..!

వాతావరణం మారినప్పుడు.. అందులోనూ వర్షాకాలంలో వివిధ వ్యాధుల బారిన పడడం మామూలే. అయితే- ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు మరింత అధికం.

Published : 09 Sep 2023 12:17 IST

వాతావరణం మారినప్పుడు.. అందులోనూ వర్షాకాలంలో వివిధ వ్యాధుల బారిన పడడం మామూలే. అయితే- ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు మరింత అధికం. ఈ క్రమంలో- వానలు కురిసే వేళ దగ్గు, జలుబు, జ్వరాల వంటి సమస్యల బారిన పడకుండా ఈ పానీయం ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.

కావాల్సిన పదార్థాలు

మరిగించిన నీరు -2 కప్పులు

నిమ్మకాయలు- ఒకటిన్నర

తాజా అల్లం రసం- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్

మామిడి అల్లం - టేబుల్‌ స్పూన్

తేనె- 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు - చిటికెడు

దాల్చిన చెక్క- (రుచి కోసం)

తయారీ!

ముందుగా ఒక గిన్నె/టీపాట్‌ లోకి తేనె, నిమ్మరసం, అల్లం రసం, మామిడి అల్లం, దాల్చిన చెక్క, ఉప్పు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమానికి మరిగించిన నీటిని జత చేసి తేనెతో పాటు మిక్స్‌ చేసిన పదార్థాలన్నీ కరిగిపోయేవరకు బాగా కలపాలి. ఆ తర్వాత దీనిపై మూత పెట్టి 5-6 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆపై ఒక కప్పులోకి వడకట్టుకుని తాగాలి.

వేటితో ఏ ప్రయోజనం..?

తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును క్రమంగా మెరుగుపరుస్తాయి.

అల్లంలో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. జీవక్రియల రేటు కూడా మెరుగుపడుతుంది.

నిమ్మలో సహజంగా ఉండే సి-విటమిన్‌, పొటాషియం రోగ నిరోధక శక్తి పెరగడానికి సహకరిస్తాయి. అలాగే శరీరంలోని విష పదార్థాల ప్రభావాన్ని తగ్గిస్తాయి.

ఇక మామిడి అల్లం పోషకాల సమూహం. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్లనొప్పులు, చర్మంపై దురద, గాయాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అదేవిధంగా దగ్గు, అజీర్తి సమస్యలను తగ్గిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని