పెన్‌డ్రైవ్స్‌కి కొత్త హంగులు!

మొబైల్స్‌, పీసీ, ల్యాప్‌టాప్స్‌లో ఉండే ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్‌ని పెన్‌డ్రైవ్స్‌లో బ్యాకప్‌ తీసుకోవడం మనకు తెలిసిందే! అయితే తమ వద్ద ఉండే ప్రతి గ్యాడ్జెట్‌నూ ఫ్యాషనబుల్‌గా, ఆకర్షణీయంగా మార్చుకోవాలని ఆరాటపడే అమ్మాయిల కోసం.. పెన్‌డ్రైవ్స్‌ కూడా సరికొత్త హంగులద్దుకొని మార్కెట్లో కొలువుదీరాయి.

Published : 25 Nov 2023 12:53 IST

మొబైల్స్‌, పీసీ, ల్యాప్‌టాప్స్‌లో ఉండే ఫొటోలు, వీడియోలు, ఆడియో ఫైల్స్‌ని పెన్‌డ్రైవ్స్‌లో బ్యాకప్‌ తీసుకోవడం మనకు తెలిసిందే! అయితే తమ వద్ద ఉండే ప్రతి గ్యాడ్జెట్‌నూ ఫ్యాషనబుల్‌గా, ఆకర్షణీయంగా మార్చుకోవాలని ఆరాటపడే అమ్మాయిల కోసం.. పెన్‌డ్రైవ్స్‌ కూడా సరికొత్త హంగులద్దుకొని మార్కెట్లో కొలువుదీరాయి.

బిస్కట్స్‌, చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్‌, పండ్ల ఆకృతిలో రూపొందించినవి, బర్గర్‌/శాండ్‌విచ్‌ తరహాలో తయారుచేసినవి, పెన్సిల్‌/పెన్‌ రూపంలో హంగులద్దినవి, ఈఫిల్‌ టవర్‌ వంటి చారిత్రక కట్టడాలు, వయొలిన్‌ వంటి సంగీత వాయిద్యాలు, చెస్‌ బోర్డు కాయిన్స్‌ను పోలినవి, పాండా ఆకృతిలో రూపొందించినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే విభిన్న డిజైన్లతో హంగులద్దిన పెన్‌డ్రైవ్స్‌ లభ్యమవుతున్నాయి. మ్యాగ్నెట్‌ పౌచ్‌ తరహాలో క్లోజ్‌ చేసుకునేలా మరికొన్ని దొరుకుతున్నాయి. ఇంకొన్నింటిని కీచెయిన్స్‌ మాదిరిగా డిజైన్‌ చేశారు. వీటిలోనూ క్యాప్‌తో క్లోజ్‌ చేసుకునేలా లేదంటే స్లైడింగ్‌ తరహాలో బయటికి, లోపలికి ప్రెస్‌ చేసేలా ఉన్నవీ లభిస్తున్నాయి. అలాంటి స్టైలిష్‌ పెన్‌డ్రైవ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్