ఈ అలారం ఆపాలంటే.. లేచి పరిగెత్తాల్సిందే!

ఉదయాన్నే నిద్ర లేవాలని అలారం పెట్టుకోవడం, అది మోగగానే ఆఫ్‌ చేసి ఇంకాసేపు పడుకోవడం మనలో చాలామందికి అలవాటు! ఇంకేముంది? లేచేసరికి ఆలస్యమైపోయిందని హడావిడి పడుతుంటాం.

Published : 04 Nov 2023 14:47 IST

ఉదయాన్నే నిద్ర లేవాలని అలారం పెట్టుకోవడం, అది మోగగానే ఆఫ్‌ చేసి ఇంకాసేపు పడుకోవడం మనలో చాలామందికి అలవాటు! ఇంకేముంది? లేచేసరికి ఆలస్యమైపోయిందని హడావిడి పడుతుంటాం. అలారం మోగినప్పుడు లేస్తే ఈపాటికి పనులన్నీ పూర్తయ్యేవి కదా అని బాధపడుతుంటాం. అయితే ఈ బద్ధకాన్ని దూరం చేయడానికి ‘రన్నింగ్ ఎవే అలారం క్లాక్స్‌’ ప్రస్తుతం మార్కెట్లోకొచ్చాయి.

పేరుకు తగినట్లుగానే ఇవి పారిపోయే అలారమ్స్‌. ఇందులో భాగంగా.. బ్యాటరీతో నడిచే డిజిటల్‌ అలారం క్లాక్‌కి ఇరువైపులా రెండు చక్రాలుంటాయి. సాధారణ అలారంలాగే ఇందులోనూ అలారం పెట్టుకొని ఒక చోట ఉంచుకోవాలి. నిర్ణీత సమయానికి ఇది మోగగానే.. రెండు చక్రాలూ ముందుకు వెనక్కి కదులుతూ మీకు దూరంగా వెళ్లిపోతుంది.. దాంతో మీరు పడుకొనే అలారం ఆఫ్‌ చేస్తానంటే కుదరదు.. అది ఆఫ్‌ కావాలంటే దాని వెంట పరిగెత్తాల్సిందే! లేదంటే అది మోగుతూనే ఉంటుంది. ఇంకేంటి.. దాన్ని ఆఫ్‌ చేయడానికైనా మీరు నిద్ర లేవాల్సిందే! ఇలా సమయానికి నిద్ర లేపి, మీ బద్ధకాన్ని దూరం చేసే ఈ అలారం క్లాక్స్‌ వేర్వేరు రంగుల్లో మార్కెట్లో దొరుకుతున్నాయి.

ఇదే కాదు.. ‘రన్ ఎవే ఫ్లైయింగ్‌ అలారం క్లాక్‌’ అనే మరో అలారం కూడా అందుబాటులో ఉంది. అలారం మోగగానే దీనిపైన ఉండే ఫ్యాన్‌ డ్రోన్‌ మాదిరిగా గాల్లోకి ఎగురుతుంది. ఆ ఫ్యాన్‌ని పట్టుకొని ఆపే దాకా అలారం మోగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ అలారం మోగినా కచ్చితంగా నిద్ర లేవాల్సిందే! మొత్తానికి భలే ఉన్నాయి కదా ఈ సరికొత్త అలారం క్లాక్స్‌. అందుబాటు ధరల్లోనే దొరుకుతోన్న వీటిని ఇంటికి తెచ్చేసుకుందామా మరి?!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్