గోడ కట్టుకుని కూర్చోవద్దు!

పెళ్లయిన తరువాత ఇద్దరి మనసులు కలిసేందుకూ, ఒకరినొకరు అర్థం చేసుకునేందుకూ కొంత సమయం పడుతుంది. కానీ, ఇప్పుడు ఒకరికొకరు అర్థం అయ్యేలోపే నీకూ నాకూ పొసగదు అనే తీవ్ర నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

Published : 02 Jan 2023 00:34 IST

పెళ్లయిన తరువాత ఇద్దరి మనసులు కలిసేందుకూ, ఒకరినొకరు అర్థం చేసుకునేందుకూ కొంత సమయం పడుతుంది. కానీ, ఇప్పుడు ఒకరికొకరు అర్థం అయ్యేలోపే నీకూ నాకూ పొసగదు అనే తీవ్ర నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే...

* అనుబంధంలో అహానికి చోటివ్వకండి. అది మీ మధ్యకు చేరితే తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే దుస్తుల వరకూ అన్నీ సమస్యలుగా మారతాయి. ఏ పని అయినా చేయలేకపోయినా, మర్చిపోయినా... దానికి మన్నించమని అడగడానికి సంకోచించొద్దు. నేనింతే, నేనే ఎందుకు చేయాలి...వంటి మాటలు మీ మధ్య దూరాన్ని పెంచేస్తాయి. ప్రేమగా అడిగి చూడండి. కచ్చితంగా అవతలివారి స్పందనా అంతే సానుకూలంగా ఉంటుంది. అప్పుడు గొడవలకు ఆస్కారమే ఉండదు. 

* ఆలుమగలుగా... ఇంటిని తీర్చిదిద్దుకునే బాధ్యత మీ ఇద్దరిదీ అనే విషయాన్ని ముందు అవగాహన చేసుకోండి.  చేయాల్సిన పనులను పంచుకోవడం మంచిదే... అలాగని అన్నింట్లోనూ వాటాలు వేసుకోవడం, ప్రతిదీ పరిధి గీసుకుని పనిచేయడం, లేదంటే వాదులాడుకోవడం సరికాదు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో స్నేహితుల్లా కలిసి పనులు చేసుకోగలిగితే ఒకరినొకరు విమర్శించుకొనే పరిస్థితి ఎదురుకాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్