Relationship: అతనికి మీరంటే అసూయా?

అన్యోన్యంగా సాగే దాంపత్యంలో అనుకోని అవాంతరాలు రావడానికి కారణాల్లో అసూయ కూడా ఒకటంటున్నారు నిపుణులు. దీనికి కారణం ఎదుటివారి ప్రవర్తనలోనూ ఉంటుందని చెబుతున్నారు.

Published : 22 May 2023 00:14 IST

అన్యోన్యంగా సాగే దాంపత్యంలో అనుకోని అవాంతరాలు రావడానికి కారణాల్లో అసూయ కూడా ఒకటంటున్నారు నిపుణులు. దీనికి కారణం ఎదుటివారి ప్రవర్తనలోనూ ఉంటుందని చెబుతున్నారు.

దంపతుల్లో ఏ ఒక్కరైనా అవతలివారికి సరైన సమయం కేటాయించకపోతే అక్కడే సమస్య మొదలవుతుంది. దాంతోపాటు దొరికిన కాస్తంతసేపు కూడా ఫోన్‌లోనే ఉంటే భాగస్వామి మనసు గాయపడుతుంది. అవతలివారు తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన రావడానికి అవకాశం ఉంది. అలాగే తమకన్నా మరొకరికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే ఆలోచన అసూయకు దారి తీస్తుంది. అలా కాకుండా భార్యాభర్తలు రోజు కొంత సమయాన్ని తమకోసమని కేటాయించుకోవాలి. మనసులోని ఆలోచనలు, ఆనందాలను పంచుకోవాలి. సమస్యలను కలిసి చర్చించాలి. ఇవి అవతలివారిలో అసూయను దరికి చేరనివ్వవు.

కేటాయించి.. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూర్తిగా టీవీ, ఫోన్‌ అంటూ సమయాన్ని వృథా చేస్తూ భాగస్వామిని దూరం పెట్టకూడదు. దంపతుల్లో ఎదుటివారు తమకే సొంతం అనుకొన్నప్పుడు భోజనం వంటి అవసరాలకు తప్ప మరొక మాట మాట్లాడకుండా ఎదుటివారుంటే మాత్రం సమస్యకు చోటిచ్చినట్లే. భార్యాభర్తల్లో ఒకరు తమకు పనెక్కువగా ఉందంటూ కారణం చూపించకుండా ఎదుటివారికి అందులో కొంతపనిని పంచడం అలవాటు చేసుకోవాలి. ఇరువురూ కలిసి పని పూర్తిచేయడంలో ఒకరికొకరు సమయం కేటాయించలేదన్న వేదన ఉండదు. ఇరువురి మధ్య అనుబంధం పెరుగుతుంది. భార్యాభర్తలగానే కాకుండా మంచి స్నేహం కూడా చిగురిస్తుంది.

చులకన వద్దు.. భాగస్వామిని అతిగా పొగడకపోయినా ఫరవాలేదు. వారెదుట మరొకరిని పోల్చి మాత్రం మాట్లాడకూడదు. అవతలివారిని మరీ ఎక్కువగా ప్రశంసించకూడదు. అది అసూయగా మారే ప్రమాదం ఉంది. అలాగే బయటివారిని ఎక్కువగా పొగుడుతూ, వారెదుట భాగస్వామిని చులకన చేయకూడదు. మాటలతో కించపరచకూడదు. అందరెదుటా భార్యాభర్తలు  ఒకే మాటపై ఉండాలి. అభిప్రాయబేధాలను ఎదుటివారి ముందు ప్రస్తావించకూడదు. ఈ నియమాలను పాటిస్తే చాలు. ఆ దంపతుల మధ్య ఈర్ష్యా, అసూయకు చోటుండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్