చలికాలంలో మడమలు పగలకుండా..!

చలికాలంలో మడమల వద్ద చర్మం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడుతుంటాయి. దీనివల్ల నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతుంటారు చాలామంది అమ్మాయిలు. అయితే ఈ సమస్యకు ఇంటి చిట్కాలతో పరిష్కారం చూపచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

Published : 21 Nov 2023 12:22 IST

చలికాలంలో మడమల వద్ద చర్మం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడుతుంటాయి. దీనివల్ల నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బంది పడుతుంటారు చాలామంది అమ్మాయిలు. అయితే ఈ సమస్యకు ఇంటి చిట్కాలతో పరిష్కారం చూపచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

మడమల వద్ద పొడిబారిన చర్మానికి తిరిగి తేమనందించాలంటే తరచూ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు షియా బటర్‌ అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుంది.

ఓట్స్‌, తేనె, బాదం నూనె, పాలు, చక్కెర.. వీటిని కొద్ది మొత్తాల్లో తీసుకొని బరకగా ఉండేలా పేస్ట్‌ తయారుచేసుకోవాలి. దీన్ని మడమలపై అప్లై చేసి.. కాసేపు మర్దన చేయాలి. అరగంట తర్వాత కడిగేసుకొని.. ఆపై కొబ్బరి నూనె రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. మడమల్లో మృత చర్మం తొలగిపోయి మృదువుగా మారతాయి.

రోజూ రాత్రి పడుకునే ముందు పసుపు-ఆలివ్‌ నూనె కలిపి తయారుచేసిన పేస్ట్‌ని మడమలకు పట్టించాలి. ఆపై సాక్స్‌ వేసుకుంటే ఈ మిశ్రమం బెడ్‌షీట్స్‌కి అంటకుండా ఉంటుంది. ఇక ఉదయాన్నే కడిగేసుకోవాలి. క్రమం తప్పకుండా రోజూ ఈ చిట్కా పాటిస్తే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

పడుకునే ముందు పెట్రోలియం జెల్లీని పాదాలకు రాసుకొని కాసేపు మర్దన చేసుకోవాలి. దీనివల్ల అది చర్మంలోకి బాగా ఇంకుతుంది. ఫలితంగా అక్కడి చర్మం మృదువుగా మారుతుంది.

పాదాలకు, మడమలకు తరచూ కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో మర్దన చేసుకున్నా ఫలితం ఉంటుంది.

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా లభించే పాలకూర, చేపలు, వాల్‌నట్స్‌, సోయా.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే విటమిన్ ‘ఇ’ అధికంగా లభించే వెజిటబుల్ ఆయిల్స్, ఆకుకూరలు, గోధుమలు, చేపలు, తృణ ధాన్యాలు, నట్స్.. మొదలైనవి కూడా ఆహారంగా తీసుకోవడం మంచిది.

మడమలు పొడిబారకుండా సంరక్షించుకోవాలంటే రసాయనాలు అధికంగా ఉండే సబ్బులు, బాత్‌ లిక్విడ్స్‌కి దూరంగా ఉండడం మంచిది. అలాగే స్నానం చేశాకా.. పాదాల్ని, మడమల్ని పొడిగా తుడుచుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్