Allu Arjun: అది అమ్మకే సాధ్యం.. ఇదేమో స్నేహ స్పెషాలిటీ..!

‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి, రెండు ఆడవాళ్లకి..’ అంటాడు ‘అల వైకుంఠపురం’ సినిమాలో అల్లు అర్జున్‌. అలాగే తన జీవితంలోనూ ఇద్దరు స్ఫూర్తివంతమైన మహిళలున్నారని చెబుతున్నాడు.

Updated : 16 Mar 2024 14:35 IST

(Photos: Instagram)

‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి, రెండు ఆడవాళ్లకి..’ అంటాడు ‘అల వైకుంఠపురం’ సినిమాలో అల్లు అర్జున్‌. అలాగే తన జీవితంలోనూ ఇద్దరు స్ఫూర్తివంతమైన మహిళలున్నారని చెబుతున్నాడు. ఒకరు తన తల్లి నిర్మల అల్లు, ఇంకొకరు ఆయన ఇష్టసఖి అల్లు స్నేహా రెడ్డి. మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవితంలో వారు స్ఫూర్తి నింపిన వైనాన్ని ఇలా నెమరువేసుకున్నాడీ హ్యాండ్‌సమ్‌ హీరో.

అదే అమ్మ స్పెషాలిటీ!

‘వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా నాలో స్ఫూర్తి నింపిన మొదటి వ్యక్తి మా అమ్మ. తన సింప్లిసిటీ అంటే నాకు బాగా ఇష్టం. జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకుల్ని, సుఖాల్ని ఒకేలా ట్రీట్‌ చేయడం అమ్మకే చెల్లుతుంది. నిజానికి ఇలా జీవితాన్ని కొనసాగించడం అంత సులభం కాదు. ఇక ప్రతిదీ ముందు చూపుతో ఆలోచిస్తుంది. మోడ్రన్‌గా ఉండడమంటే మోడ్రన్‌ దుస్తులు వేసుకోవడం, ఇంగ్లిష్‌ మాట్లాడేయడం కాదు.. మన ఆలోచనా విధానం ఆధునికంగా ఉండాలని చెబుతుంటుంది. అందుకే ‘మీ జీవితంలో అత్యంత ఆధునికంగా ఆలోచించే వ్యక్తి ఎవర’ని అడిగితే అమ్మ పేరు చెబుతా. పిల్లలు ఒక స్థాయికి వచ్చాక చాలామంది పేరెంట్స్‌ వాళ్ల నుంచి కొన్ని ఆశిస్తుంటారు. కానీ అమ్మ ఇంతవరకు మా నుంచి ఏమీ ఆశించలేదు. అది ఆమె సింప్లిసిటీకి మరో నిదర్శనం. ప్రస్తుతం ఆమెను ఉన్నతంగా చూసుకొనే స్థితిలో నేనుండడం నా అదృష్టం. ఇదంతా అమ్మ చలవే!


తనే నా పెద్ద విమర్శకురాలు!

అర్ధాంగి అంటే భర్తలో సగమే కాదు.. ఆయన చేసే ప్రతి పనిలోనూ వెన్నంటి నిలిచే ఓ ప్రోత్సాహం. ఈ మాటలు నా భార్య స్నేహకు అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. ఆమెలో నాకు బాగా నచ్చే గుణాలు రెండు. ఒకటి - తన హుందాతనం.. ఎలాంటి సందర్భంలోనైనా హుందాగా వ్యవహరిస్తుంటుంది. ఇక రెండోది - బ్యాలన్స్‌డ్‌గా ఉండే తన వ్యక్తిత్వం. ఆనందమొచ్చినా, బాధ కలిగినా.. ఒకే రకంగా స్వీకరిస్తుంది. అప్పుడప్పుడూ తనను చూస్తే ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతుంటా. ఇక తనెంతో స్ట్రిక్ట్‌. ఇంటి వాతావరణాన్ని, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని క్రమశిక్షణతో మెలిగేలా చేస్తుంది. సినిమాల విషయానికొస్తే.. తనే నా పెద్ద విమర్శకురాలు. ఒక రకంగా ఇదీ నా సక్సెస్‌కు కారణమే! ఇలా ఈ ఇద్దరి నుంచీ నా వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా..’ అంటున్నాడీ స్టైలిష్‌ స్టార్.

Jr NTR: వాళ్లే నా ‘వండర్‌ విమెన్’!

SS Rajamouli: వాళ్లే నా జీవితానికి డిజైనర్లు!

Amitabh Bachchan: ఆమె కంటే అందగత్తె లేదు.. తనే నా రోల్‌మోడల్!

Narendra Modi: నన్నో వ్యక్తిగా, శక్తిగా మలిచింది తనే!

Anand Mahindra: ఆమె జీవితమే నాకు స్ఫూర్తి!

Virat Kohli: ఆ ఇద్దరే నా ‘సూపర్ విమెన్’!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్