Narendra Modi: నన్నో వ్యక్తిగా, శక్తిగా మలిచింది తనే!

జన్మనివ్వడమే కాదు.. మంచిచెడ్డలు చెబుతూ, జీవిత పాఠాలు నేర్పుతూ బిడ్డకు తొలి గురువుగా మారుతుంది అమ్మ. తనకు స్ఫూర్తిప్రదాతగా, ఆదర్శమూర్తిగా నిలుస్తుంది. అలా తననో వ్యక్తిగా, శక్తిగా మార్చిన మహిళామూర్తి తన తల్లే అంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ.

Updated : 16 Mar 2024 15:13 IST

(Photos: Twitter)

జన్మనివ్వడమే కాదు.. మంచిచెడ్డలు చెబుతూ, జీవిత పాఠాలు నేర్పుతూ బిడ్డకు తొలి గురువుగా మారుతుంది అమ్మ. తనకు స్ఫూర్తిప్రదాతగా, ఆదర్శమూర్తిగా నిలుస్తుంది. అలా తననో వ్యక్తిగా, శక్తిగా మార్చిన మహిళామూర్తి తన తల్లే అంటున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఆమె నిరాడంబరత, పంచిన నిష్కల్మషమైన ప్రేమే తనలో అన్ని విధాలుగా స్ఫూర్తి రగిలించిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

ప్రతిభ ఉన్న మహిళల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు ప్రధాని మోదీ. మహిళా సాధికారతకు పెద్ద పీట వేసేలా ఆయన చేసే ప్రసంగాలు, ప్రారంభించే కార్యక్రమాలు ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతుంటాయి. ఇలా మహిళల పట్ల తనలో గౌరవమర్యాదలు రెట్టింపు కావడానికి తన తల్లి హీరాబెన్‌ మోదీ అందించిన స్ఫూర్తే కారణమంటున్నారాయన. చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలకోర్చి ఆమె దృఢంగా నిలబడిన తీరే తనలో అడుగడుగునా స్ఫూర్తి నింపిందంటున్నారు.

అమ్మే.. ఓ డాక్టర్!

‘అందరమ్మల్లాగే మా అమ్మ కూడా ఎంతో నిరాడంబరంగా జీవితాన్ని గడిపింది. తన చిన్న వయసులోనే మా అమ్మమ్మ చనిపోవడంతో తల్లి లేకుండానే పెరిగింది. మట్టి గోడల మధ్యే తన బాల్యాన్ని గడిపింది. ఎలాంటి కష్టమొచ్చినా సానుకూల దృక్పథంతో ఎదుర్కొనేది. ఇంటి పనులన్నీ త్వరత్వరగా ముగించుకొని చరఖా తిప్పేది.. ఇలా ఇంటి ఆర్థిక పరిస్థితుల్ని చక్కదిద్దడానికి తన వంతుగా సహకరించేది. మా అమ్మకు పదహారేళ్లకే పెళ్లైంది. అయినా అత్తారింట్లోనూ ఆమెకు ఆర్థిక కష్టాలు తప్పలేదు. చదువుకుందామన్న కోరిక ఉన్నా చదువుకోలేని పరిస్థితి. అందుకే మమ్మల్ని ఉన్నత చదువులు చదివించాలని సంకల్పించుకుంది. అమ్మకు ఆయుర్వేదంలో పట్టుంది. అందుకే చదువు లేకపోయినా ఊళ్లో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సహజ చిట్కాలతోనే నయం చేసేది. అందుకే అమ్మను ఊళ్లో అందరూ ఓ డాక్టర్‌లా చూసేవారు. ‘Dossi Ma’ అంటూ ప్రేమగా పిలిచేవారు..’!

ఆధ్యాత్మికతనూ పంచింది!

‘అమ్మ తన వందేళ్ల జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించింది. ముఖ్యంగా ఆమె ఆహారపుటలవాట్లు, జీవనశైలి నన్నెంతగానో ప్రభావితం చేసేవి. రోజుకు రెండుసార్లు బావిలో నుంచి నీళ్లు తోడడం, చెరువుకెళ్లి బట్టలుతకడం, మెట్లెక్కడం, ఇంటి పనులన్నీ చేయడం, సజ్జలతో చేసిన రొట్టెలు ఆహారంగా తీసుకోవడం.. ఇవే ఆమె ఆరోగ్య రహస్యాలని చెబుతా. అమ్మకు దైవభక్తీ ఎక్కువే! పండగలప్పుడు దేవాలయాలకు వెళ్లేది.. మాలోనూ ఆధ్యాత్మిక చింతనను పెంచేది. శుభాశీస్సులు అందించేది. ఇలా ఈ ఆధ్యాత్మిక భావాలే నాలోనూ స్ఫూర్తి రగిలించాయి..’ అంటారు మోదీజీ. ఇలా ఎన్నో జీవిత పాఠాలతో పాటు పొదుపు పాఠాలూ నేర్పిన తన మాతృమూర్తి ప్రత్యేకతను స్మరించుకుంటూ తన విజయం వెనుక తన తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందంటున్నారాయన!

Anand Mahindra: ఆమె జీవితమే నాకు స్ఫూర్తి!

ఆ ఇద్దరే నా ‘సూపర్ విమెన్’!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్