ఎముకల ఆరోగ్యానికి.. ఇవి!

మహిళలకు ఎదురయ్యే సమస్యల్లో ఆస్టియోపొరోసిస్‌ ఒకటి. ఎముకలు బలహీనపడి, విరిగిపోవడం ఈ సమస్యలో కనిపిస్తుంది. పురుషులతో పోల్చితే మహిళల్లోనే ఆస్టియోపొరోసిస్‌ రిస్క్‌ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

Published : 28 Oct 2023 19:42 IST

మహిళలకు ఎదురయ్యే సమస్యల్లో ఆస్టియోపొరోసిస్‌ ఒకటి. ఎముకలు బలహీనపడి, విరిగిపోవడం ఈ సమస్యలో కనిపిస్తుంది. పురుషులతో పోల్చితే మహిళల్లోనే ఆస్టియోపొరోసిస్‌ రిస్క్‌ ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు హార్మోన్ల మార్పులే కారణమంటున్నారు. ముఖ్యంగా ఎముక ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు మెనోపాజ్‌కు చేరువయ్యే మహిళల్లో తగ్గిపోతాయి. ఫలితంగానే ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు. ఈ క్రమంలో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి అని చెబుతున్నారు.

వెన్న తొలగించిన పాలు, కప్పు పెరుగు తీసుకోవడం వల్ల రోజువారీ శరీరానికి కావాల్సిన క్యాల్షియంలో 30 శాతం వరకూ అందుతుంది. అలాగే విటమిన్‌ ‘డి’ని కూడా పొందచ్చు.

ఛీజ్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. అయితే ఇందులో క్యాలరీల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోతాదుకు మించకుండా తీసుకోవాలి.

కోడిగుడ్లలో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్‌ ‘డి’ కూడా అందుతుంది. కాబట్టి రోజుకో గుడ్డు తీసుకోవడం తప్పనిసరి!

పాలు, పాల పదార్థాలు నచ్చని వారు పాలకూర తీసుకోవచ్చు. కప్పు ఉడికించిన పాలకూరలో రోజులో శరీరానికి అవసరమైన క్యాల్షియంలో 25 శాతం వరకూ అందుతుంది. దాంతో పాటు పీచు, ఇనుము, ‘ఎ’ విటమిన్‌ కూడా శరీరానికి అందుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్