మొటిమలకు ఇవీ కారణం కావచ్చు..!

అద్దంలో చూసుకున్నప్పుడు ఓ మొటిమ కనిపిస్తే చాలు.. విలవిల్లాడిపోతాం. తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే వయసు, హార్మోన్ల ప్రభావంతో పాటు మొటిమలు రావడానికి ఇతరత్రా వివిధ కారణాలు ఉండచ్చంటున్నారు నిపుణులు.

Published : 22 Feb 2022 18:46 IST

అద్దంలో చూసుకున్నప్పుడు ఓ మొటిమ కనిపిస్తే చాలు.. విలవిల్లాడిపోతాం. తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అయితే వయసు, హార్మోన్ల ప్రభావంతో పాటు మొటిమలు రావడానికి ఇతరత్రా వివిధ కారణాలు ఉండచ్చంటున్నారు నిపుణులు.

* అదేపనిగా ఫోన్‌ని మనం చెంపలకు ఆనించి మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ తెరపై ఉండే బ్యాక్టీరియా ముఖ చర్మంలోకి చేరుతుందట. దాంతో కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉందట. కాబట్టి తరచూ ఫోన్‌ తెరను శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే ఎక్కువసార్లు మాట్లాడాల్సి వస్తే.. ఇయర్‌ ఫోన్లు వాడడం మంచిది.

* విటమిన్‌ ‘డి’ లోపం ఉన్నా కూడా మొటిమల సమస్య మొదలు కావచ్చు. అందుకే వైద్యుల సలహా మేరకు తగినన్ని పోషకాలు, సప్లిమెంట్లు తీసుకోవడం ద్వారా ఈ సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు.

* కాఫీ.. చర్మంలోని పీహెచ్‌ సమతుల్యతని దెబ్బతీస్తుంది. అందుకే దీనికి బదులుగా గ్రీన్ టీ, మంచి నీళ్లు ఎక్కువగా తాగడం ఉత్తమం.

* మనం వాడే కొన్ని రకాల క్రీమ్స్ చర్మంలో జిడ్డును ఇంకా పెంచుతాయి. క్రమంగా అది మొటిమలకు దారితీస్తుందని మరవకూడదు.

* బలంగా రుద్దితే చర్మంపై చేరిన మృతకణాలు పోయి.. ముఖం బాగా శుభ్రపడుతుందనుకుంటారు కొందరు. కానీ అది పొరపాటు. చర్మాన్ని ఎప్పుడూ సున్నితంగా రుద్ది, కడగాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్