పుట్టే బిడ్డల్లో అవయవలోపాలు ఎందుకొస్తాయి?
నమస్తే మేడం. నా వయసు 26. పెళ్లై ఆరేళ్లయింది. నాకు 4 ఏళ్ల బాబున్నాడు. ఈమధ్యే మళ్లీ బాబు పుట్టాడు. అయితే మా రెండో బాబు రెండు చెవులు, ఒక ముక్కు రంధ్రం మూసుకుపోయి పుట్టాడు. కిడ్నీలో వాపుందని, గుండె సమస్య కూడా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోలేకపోతున్నాడని.....
నమస్తే మేడం. నా వయసు 26. పెళ్లై ఆరేళ్లయింది. నాకు 4 ఏళ్ల బాబున్నాడు. ఈమధ్యే మళ్లీ బాబు పుట్టాడు. అయితే మా రెండో బాబు రెండు చెవులు, ఒక ముక్కు రంధ్రం మూసుకుపోయి పుట్టాడు. కిడ్నీలో వాపుందని, గుండె సమస్య కూడా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోలేకపోతున్నాడని ఆక్సిజన్ పెట్టే ఉంచారు. ఇక ఐదు రోజులకు ఇంటికి తీసుకొచ్చాక చనిపోయాడు. అసలు ఇలా బిడ్డ అవయవ లోపంతో పుట్టడానికి ఏవైనా కారణాలున్నాయా? దీని ప్రభావం మరో ప్రెగ్నెన్సీపై ఏమైనా ఉంటుందా? దయచేసి సలహా ఇవ్వండి. - ఓ సోదరి
జ. మీ రెండో బాబు దురదృష్టవశాత్తూ చనిపోయాడంటే అందుకు పుట్టుకతోనే వచ్చే అనేక లోపాలు కారణం అని అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ముక్కు, చెవులు, కిడ్నీ, గుండె.. వీటన్నింటిలో తేడాలున్నాయని రాశారు. మరి ఇవన్నీ గమనించినప్పుడు.. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు గానీ, బాబు పుట్టాక గానీ.. మీకు, బాబుకి ఎలాంటి పరీక్షలైనా జరిగాయా? మామూలుగా పుట్టుకతోనే వచ్చే అవయవ లోపాలు క్రోమోజోముల్లో గానీ, జీన్స్‌లో గానీ లోపాలుంటే వస్తాయి. బిడ్డను వివరంగా పరీక్షించడం ద్వారా వివిధ రకాల సిండ్రోమ్స్ని కూడా గుర్తిస్తారు. మీకు తర్వాతి ప్రెగ్నెన్సీ గురించి అవగాహన కావాలంటే ఈ బాబు వివరాలన్నీ తీసుకొని జెనెటిక్ కౌన్సెలింగ్‌కి వెళ్లాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డకు ఇలా జరగడానికి ఎంత శాతం అవకాశం ఉంటుంది? అదీ మీరు గర్భవతిగా ఉండగా మొదటి లేదా రెండో త్రైమాసికంలోనే గుర్తించగలుగుతామా?.. వంటి విషయాలన్నీ మీకు చెప్పగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- బంగారం... ఇలా కొందామా?!
- స్టైల్‌గా... సురక్షితంగా
- చర్మ సౌందర్యానికీ ‘గుడ్డు’..!
- కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే..!
- Met Gala 2024: గ్రీన్ కార్పెట్‌పై తారల సొగసులు!
ఆరోగ్యమస్తు
- నిర్లక్ష్యం చేయొద్దు!
- చిన్నారులకు ఎంత ఉష్ణోగ్రత దాటితే డాక్టర్‌కి చూపించాలి?
- ‘కీరా దోస’తో.. కోరినంత ఆరోగ్యం!
- నలభై దాటాక.. ఇమ్యూనిటీ పెరగాలంటే..!
- వేడికి... సహజ మంత్రం!
అనుబంధం
- నా ఫ్రెండ్ భర్త.. అసభ్యకర ఫొటోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు!
- అందుకే.. కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
- ఆపొద్దు.. ఎగరనిద్దాం!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
యూత్ కార్నర్
- అడవితో ప్రేమలో పడి ఐఎఫ్ఎస్లో గెలిచి!
- Akshaya Tritiya: ‘డిజిటల్ గోల్డ్’ కొంటున్నారా?
- కథ వెనక కథ
- ఆ గ్రామం నుంచి తొలి నౌకాధికారిణి..!
- సైన్స్లోకంలో విహరిద్దాం రండి!
'స్వీట్' హోం
- Akshaya Tritiya: బంగారం స్వచ్ఛతను తెలుసుకునేదెలా?
- వంట చేసేటప్పుడు.. ఈ చిట్కాలు పాటిస్తున్నారా?
- ముంగిట్లో నక్షత్రాలు రాలుతున్నట్లుగా...!
- వాషింగ్ మెషీన్ వాడేద్దామిలా!
- పనిభారం ఉండదిక..!
వర్క్ & లైఫ్
- ఆఫీసు కష్టాలు చెప్పే ఊలు బంతి!
- అమ్మతో.. నా అనుబంధం!
- బాబుకి డయాబెటిస్... ఏం పెట్టాలి?
- అది అతి అయ్యిందేమో!
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’ కూడా చేసుకుంటారు!