కోపాన్ని జయిస్తే...
రమణికి ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దీంతో భర్త, పిల్లలు ఆమెతో మాట్లాడటానికే భయపడుతుంటారు. బంధువులు, స్నేహితులు కూడా ఆమెకు దూరం జరుగుతున్నారు.
రమణికి ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దీంతో భర్త, పిల్లలు ఆమెతో మాట్లాడటానికే భయపడుతుంటారు. బంధువులు, స్నేహితులు కూడా ఆమెకు దూరం జరుగుతున్నారు. తన కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలియక, మనసుకు నచ్చినవారంతా తనకు దూరమవుతుంటే తీవ్ర వేదనకు లోనవుతోంది. ఇలా కోపాన్ని తగ్గించుకోలేని వారు జీవితంలో విలువైనవి చాలా కోల్పోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు. ఈ సమస్యకు పరిష్కారాలనూ సూచిస్తున్నారు.
* ముందుగా... అవతలివారి అభిప్రాయానికి విలువనివ్వనప్పుడు, ముందున్న వారికి చెప్పడానికి సమాధానం లేనప్పుడు లేదా ఏం చెప్పాలో తెలియని సందర్భాల్లో కోపం రావడానికి అవకాశం ఎక్కువ. ఆ సమయంలో వెంటనే నోటికొచ్చినట్లుగా మాట్లాడకుండా ఆ సందర్భమేంటో ఆలోచించాలి. ఎదుటి వ్యక్తి అభిప్రాయంతో ఏకీభవించలేకపోతే నిశ్శబ్దంగా ఉండటం మంచిది. వీలైతే అక్కడి నుంచి దూరంగా జరగాలి. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత తీవ్రతతో పాటు కోపం కూడా కాస్తంత తగ్గుతుంది. అప్పుడు మనసులోని మాటను చెప్పడానికి ప్రయత్నించాలి.
* వ్యాయామం... కోపం తీవ్రంగా వచ్చినప్పుడు వేగంగా కొంత దూరం అడుగులు వేయడం లేదా ఏదైనా పనిలోకి మనసును మళ్లించుకోవడం సాధన చేయాలి. ఇష్టమైన చిత్రలేఖనం, పుస్తక పఠనం, మనసుకు నచ్చిన వంటకం తయారు చేయడం వంటివి కోపం నుంచి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఎదుటివారిపై మాటలతో దాడి చేయకుండా కోపం నియంత్రణలోకి వస్తుంది. స్వీయ అభ్యాసం చేస్తే దీన్ని జయించొచ్చు.
* కారణం... మానసిక ఒత్తిడి, ఆందోళన, అనారోగ్యం వంటివి కోపానికి కారణాలవుతాయి. వీటిని ముందుగా గుర్తించగలగాలి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పోషకాహారాన్ని తీసుకోవాలి. రోజుకి కనీసం ఏడు గంటల నిద్ర, ఆరేడు గ్లాసుల మంచినీటిని తాగడం వంటి అలవాట్లతో ఆరోగ్యాన్ని పొందితే కొంతవరకు కోపానికి దూరంగా ఉండొచ్చు. సమస్యలను పరిష్కార కోణంలో ఆలోచించాలి. అరవకుండా మృదువుగా చర్చిస్తే అవతలి వారూ అదే స్థాయిలో మాట్లాడతారు.
* క్షమించడం... ఎదుటివారి ప్రవర్తన, నిర్లక్ష్యం వంటి అంశాలు కోపానికి దారి తీస్తాయి. విడమర్చి వారికి చెప్పడం, అవతలి వారిని క్షమించడం నేర్చుకోవాలి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో వీలైనంత మృదువుగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే మానవ సంబంధాలు ధృఢంగా ఉంటాయి. కుటుంబంతో బయటకు వెళ్లడం, పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వంటివన్నీ చేస్తే... ఇల్లే స్వర్గసీమ అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
ఆరోగ్యమస్తు
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
అనుబంధం
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకంబట్టి ఎదుగుతారు.!
- నాన్నంటే భయపడుతున్నారు..!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
యూత్ కార్నర్
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!