పిల్లలకు పర్యావరణ పాఠాలు

మనం పనికిరావనీ, అవసరం లేదనీ పడేసే వాటి వల్ల భూమిపై ఎంత చెత్త పేరుకుపోతోందో తెలుసు కదా! దీనివల్ల పర్యావరణానికీ హాని. మన పిల్లలూ ఇదే విధానాన్ని అనుసరిస్తే

Updated : 14 Apr 2022 05:11 IST

మనం పనికిరావనీ, అవసరం లేదనీ పడేసే వాటి వల్ల భూమిపై ఎంత చెత్త పేరుకుపోతోందో తెలుసు కదా! దీనివల్ల పర్యావరణానికీ హాని. మన పిల్లలూ ఇదే విధానాన్ని అనుసరిస్తే? అందుకే మనం ఆచరిస్తూ పర్యావరణాన్ని రక్షించే విధానాలను వారికీ అలవాటు చేయాలి.
మూడేళ్లకే చుట్టూ పరిస్థితులపై పిల్లల్లో అవగాహన మొదలవుతుంది. కాబట్టి.. ఇంట్లోనే వృథా వస్త్రంతో బొమ్మలు తయారుచేసివ్వడం, వారినీ అలాగే రూపొందించేలా చేయమని ప్రోత్సహించడం లాంటివి చేయాలి. అది వారిలో రీసైకిలింగ్‌ ప్రాముఖ్యాన్ని పెంపొందేలా చేస్తుంది. నచ్చలేదు, పనికి రావంటూ పక్కన పెట్టిన వారి బొమ్మలను చెత్తబుట్టలో వేయకుండా పేదపిల్లలకి వారితోనే ఇప్పించండి. వృథాకు దూరంగా ఉండటమే కాదు.. ఇతరులను ప్రేమించడమూ నేర్చుకుంటారు.

వృథా కాకుండా.. ఆహారాన్ని వృథా చేయకూడదన్న విషయాన్నీ పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు. కావాల్సొస్తేనే వడ్డించుకోవడం, పెట్టుకున్నదంతా పూర్తిచేయడం వంటివి చేస్తే వాళ్లూ అనుసరిస్తారు. అలాగే తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని చూపించడం వంటివి చేయండి. విలువ తెలుస్తుంది. విద్యుత్తు, నీరు వంటి వాటి విషయాల్లోనూ ఇదే ధోరణి అవలంబించాలి. అప్పుడే... అనవసరంగా లైట్లు వేయడం, నీటి వృథా వంటివాటికి క్రమేపీ దూరమవుతారు. వంటింటి వృథాతో మొక్కల పెంపకంలో భాగస్వాముల్ని చేయండి. వాటి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని చెప్పాలి. ఇంటా, బయట నెలకు ఒక మొక్కను పెంచే బాధ్యత అప్పగించి, పచ్చదనం ఆరోగ్యానికెంత ముఖ్యమో వివరించాలి. ఇలా ప్రతి చిన్న అంశంలోనూ పర్యావరణానికి అనుకూలమైన జీవనవిధానం ప్రతిఫలించేలా పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే భవిష్యత్తులో వారు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్