చర్మ ఛాయను పెంచే బ్రౌన్‌ షుగర్‌!

బెల్లం నుంచి నేరుగా తయారు చేసే ఈ చక్కెరలో పోషక విలువలు ఎక్కువ. దీన్ని సౌందర్య పోషణలో వాడితే చర్మం నిగారింపుతో మెరిసిపోతుంది. అదెలాగో తెలుసుకుందామా!

Published : 02 Aug 2021 01:22 IST

బెల్లం నుంచి నేరుగా తయారు చేసే ఈ చక్కెరలో పోషక విలువలు ఎక్కువ. దీన్ని సౌందర్య పోషణలో వాడితే చర్మం నిగారింపుతో మెరిసిపోతుంది. అదెలాగో తెలుసుకుందామా!

* బ్రౌన్‌షుగర్‌ చర్మంపై పేరుకున్న మృత కణాలను తొలగించి కొత్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మేను అందంగా మెరిసిపోయేలా చేస్తుంది. ఇందుకోసం ఈ చక్కెరలో కాస్త నిమ్మరసం, రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్ది స్నానం చేస్తే చాలు.

* పావుకప్పు బొప్పాయి గుజ్జులో మూడు టేబుల్‌స్పూన్ల బ్రౌన్‌షుగర్‌ చేర్చి ముఖం, మెడకు రాసి సవ్య, అప సవ్య దిశలో మర్దనా చేయాలి. ఇలా చేస్తే టాన్‌ తగ్గి చర్మ రంగు పెరుగుతుంది. ఇందులోని గ్లైకోలిక్‌ యాసిడ్‌ చర్మంపై మచ్చలు తొలగిస్తుంది.

* తక్కువ సమయంలో ముఖం కళగా కనిపించాలని భావించినప్పుడు బ్రౌన్‌ షుగర్‌లో కొద్దిగా పాలు కలిపి ఫేస్‌మాస్క్‌లా వేసుకోవచ్చు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్