ట్రెండీగా వేద్దామా గోళ్లరంగు!

ట్రెండీగా కనిపించాలంటే చేతికి గోళ్ల రంగు వేయాల్సిందే అంటారు ఈతరం అమ్మాయిలు. నిజానికి పెయింట్‌ వేసుకోవమూ ఓ కళ. అందుకోసమే ఈ చిట్కాలు...

Published : 10 Aug 2021 03:15 IST

ట్రెండీగా కనిపించాలంటే చేతికి గోళ్ల రంగు వేయాల్సిందే అంటారు ఈతరం అమ్మాయిలు. నిజానికి పెయింట్‌ వేసుకోవమూ ఓ కళ. అందుకోసమే ఈ చిట్కాలు.

గోళ్ల రంగు వేసుకునే ముందే... పాతది మొత్తం తొలగించాలి. ఆ తర్వాతే కొత్త కలర్‌ వేయాలి. దానికంటే ముందు వాటిని చక్కని ఆకృతిలో కత్తిరించుకోవడం మరిచిపోవద్దు.

* శుభ్రంగా ఉన్న గోళ్లకు మొదట మాయిశ్చరైజర్‌ రాసి కాసేపు ఆరనివ్వాలి. ఆపై పారదర్శకంగా ఉండే రంగుని బేస్‌ కోట్‌గా వేయాలి. అది ఆరాక నచ్చిన రంగు వేసుకుంటే చక్కగా కనిపిస్తుంది.

* ఒకవేళ ఒకటికి మించి వర్ణాలను వేసుకోవాలనుకుంటే ఒకటి ముదురు, మరొకటి లేత ఎంచుకోండి. నెయిల్‌ ఆర్ట్‌ వేసుకోవడానికి పెద్ద పెద్ద డిజైన్లే రావాల్సిన అవసరం లేదు. క్రమ పద్ధతిలో చుక్కలు పెట్టినా, గీతలు గీసినా అందంగానే కనిపిస్తాయి. ఇందుకోసం వాడే స్టిక్కర్లూ మార్కెట్‌లో దొరుకుతున్నాయి.

* గోళ్ల రంగు వేసేప్పుడు పై నుంచి కిందకు ఒకే దిశలో బ్రష్‌ని వాడాలి. అప్పుడే అతుకులు లేకుండా చక్కగా కనిపిస్తుంది. తేమ ఉన్నప్పుడు పదే పదే అద్దితే చిందరవందరగా కనిపిస్తుంది. 

* ఒకప్పుడు గోళ్ల రంగు అంటే ఎరుపు, గులాబీ, పాల రంగుని మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పటి అమ్మాయిలు... కాస్త కొట్టొచ్చినట్లు కనిపించే నీలం, నలుపు, వంగపూవు, ఆవ పసుపు వంటివీ... ఇంకా కొత్త రంగుల్నీ బాగా వాడుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్