ఇంట్లోనే ఫేషియల్‌!

ఫేషియల్‌ చేసుకోవడానికి కొన్ని రకాల పండ్లు, వంటింటి దినుసులు ఉంటే సరిపోతుంది. సహజ పదార్థాలతో దీన్ని ఇంట్లోనే ఎలా వేసుకోవచ్చో చూద్దామా.

Published : 23 Aug 2021 01:40 IST

ఫేషియల్‌ చేసుకోవడానికి కొన్ని రకాల పండ్లు, వంటింటి దినుసులు ఉంటే సరిపోతుంది. సహజ పదార్థాలతో దీన్ని ఇంట్లోనే ఎలా వేసుకోవచ్చో చూద్దామా.

* క్లెన్సింగ్‌... ఫేషియల్‌ చేసుకోవడంలో మొదటి స్టెప్‌ ఇది. పాలలో ముంచిన దూది ఉండతో ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఆపై నీళ్లతో కడగాలి.

* ఎక్స్‌ఫోలియేషన్‌... ఇందుకోసం ఓట్స్‌, పాలను ముద్దలా చేసి ముఖానికి పట్టించాలి. ఆపై మునివేళ్లతో  పది నిమిషాలపాటు మర్దనా చేయాలి. తర్వాత ముఖానికి ఆవిరి పడితే...మృతకణాలు తొలగిపోతాయి.

* మసాజ్‌... వంటింట్లో ఉండే తేనె, అరటిపండు, బొప్పాయి... ఇలా రకరకాల పండ్లు, పదార్థాలతో ముఖానికి మసాజ్‌ చేయొచ్చు.

* ఫేస్‌ ప్యాక్‌... ఇందుకోసం కీరదోసను వాడొచ్చు. ఇది మోముకు చల్లదనంతోపాటు మెరుపునూ అందిస్తుంది.

పై దశల్లో ఫేషియల్‌ అయ్యాక చల్లటి నీళ్లతో ముఖం కడగాలి. చివరగా మాయిశ్చరైజర్‌ రాసుకోవడం మరిచిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్