పెద్దగా కనిపిస్తున్నారా?

కొందరు తమ వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తారు. అందుకు కారణాలు ఏంటి?  ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూద్దామా...

Published : 26 Aug 2021 00:37 IST

కొందరు తమ వయసు కంటే పెద్దవారిలా కనిపిస్తారు. అందుకు కారణాలు ఏంటి?  ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూద్దామా...

* ఒత్తిడి.. దీని ప్రభావం మొదట పడేది ముఖం (చర్మం) మీదే. ఆందోళన ఎక్కువైతే కార్టిసోల్‌ అదే పనిగా విడుదలై ప్రీమెచ్యూర్‌ ఏజింగ్‌కు కారణమవుతుంది. అధిక ఆందోళన, ఒత్తిడి వల్ల చర్మంపై గీతలు, ముడతలు త్వరగా వస్తాయి. యోగా, వ్యాయామం, నడక, స్నేహితులతో సరదగా గడపడం వంటివి చేయాలి.

* సబ్బు... దీంట్లోని గాఢ రసాయనాలు చర్మంలోని సహజ నూనెలను పీల్చేస్తాయి. దాంతో చర్మం నిర్జీవంగా మారి గీతలు, ముడతలు కనిపిస్తాయి. అప్పుడూ పెద్దవారిలా కనిపిస్తారు. అందుకే తక్కువ గాఢత ఉండే క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. రోజూ ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. అప్పుడే శరీరం తాజాగా ఉంటుంది.

* నిద్రలేమి... తగినంత నిద్రపోయినప్పుడు మాత్రమే శక్తిని పుంజుకోగలుగతాం. మనం నిద్రపోతున్న సమయంలో చర్మం మరమ్మతులు చేసుకుంటుంది. నిద్రలేమి వల్ల అది తనను తాను రీజెనువేట్‌ చేసుకోలేదు. ఫలితంగా ముఖంపై ముడతలొస్తాయి. రోజుకు కనీసం ఏడెనిమిది గంటలపాటు కంటినిండా నిద్రపోవాలి.

* ఎక్కువగా చక్కెరలు... కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌లు చర్మానికి స్థితిస్థాపకతను కలిగించి యౌవ్వనంగా ఉండేలా చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం చక్కెర, గ్లూకోజ్‌ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకున్న వారిలో ఈ రెండింట్లో అమైనో ఆమ్లాలు కలిసి వాటిని దెబ్బతీస్తాయి. ఫలితం శరీరం సహజ మరమ్మతులకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి తీపిని తగ్గించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్