కండిషనర్‌ రాస్తున్నారా

ఎన్ని రకాల ఉత్పత్తులు వాడుతున్నా జుట్టు రాలుతుంటే ఈ సహజ కండిషనింగ్‌ ప్యాక్‌లు వాడి చూడండి. ఫలితం ఉంటుంది. 

Updated : 13 Sep 2022 14:09 IST

ఎన్ని రకాల ఉత్పత్తులు వాడుతున్నా జుట్టు రాలుతుంటే ఈ సహజ కండిషనింగ్‌ ప్యాక్‌లు వాడి చూడండి. ఫలితం ఉంటుంది. 

* రెండు గుడ్ల తెల్లసొనలో చెంచా చొప్పున ఆలివ్‌నూనె, వెనిగర్‌, తేనె వేసి బాగా కలపాలి. ఆపై దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. ఆపై హెయిర్‌క్యాప్‌ పెట్టి, పది నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి.

* కప్పు అరటిపండు గుజ్జులో కొద్దిగా పాలు, చెంచా చొప్పున తేనె, ఆలివ్‌నూనె... గుడ్డు కలిపి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌ వేస్తే మంచి కండిషనర్‌లా పనిచేస్తుంది. వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది.

* చెంచా కొబ్బరినూనెలో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, గులాబీనీరు, పెరుగు వేసి బాగా కలపాలి. తలస్నానం చేశాక ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి రెండు నిమిషాల ఆగి మరోసారి చన్నీళ్లతో శుభ్రం చేస్తే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్