హాయిగా స్నానం చేద్దాం

నిత్యం ఎన్నో సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ ఒత్తిడితోనే అలసట, ఒళ్లు నొప్పులు, నిద్రలేమి వంటి ఎన్నో ఇబ్బందులు. అప్పుడు ఇలా స్నానం చేయండి. ఉపశమనం దొరకుతుంది.గోరువెచ్చని నువ్వుల నూనెను ఒంటికి పట్టించి బాగా రుద్దండి. ఓ ఇరవై నిమిషాలు

Updated : 03 Oct 2021 01:56 IST

నిత్యం ఎన్నో సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ ఒత్తిడితోనే అలసట, ఒళ్లు నొప్పులు, నిద్రలేమి వంటి ఎన్నో ఇబ్బందులు. అప్పుడు ఇలా స్నానం చేయండి. ఉపశమనం దొరకుతుంది.

గోరువెచ్చని నువ్వుల నూనెను ఒంటికి పట్టించి బాగా రుద్దండి. ఓ ఇరవై నిమిషాలు చేశాక ఒంటికి ఆవిరి పట్టండి. ఇందుకు స్టీమర్‌తో పాటు వేడి నీటిలో ముంచిన తువ్వాలునూ వాడొచ్చు. తర్వాత రెండు చుక్కల రోజ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ని నీళ్లల్లో కలిపి స్నానం చేయాలి. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది.

* ఆముదం, కొబ్బరి నూనె మిశ్రమాన్ని ఒంటికి రాసి రుద్దండి. ఆపై కలబంద గుజ్జుతో ఒంటిని క్లెన్సింగ్‌ చేయండి. తర్వాత ఓ పెద్ద స్పూనుడు లావెండర్‌ బాత్‌ సాల్ట్‌ని కలిపిన నీళ్లతో శరీరాన్ని పదిహేను నిమిషాలు తడిచేలా మర్దన చేయండి. చివరిగా స్నానం చేస్తే అలసట తగ్గుతుంది. చర్మం నిగారింపుగా కనిపిస్తుంది.

* ఆలివ్‌ నూనెను వేడి చేసి దానికి చెంచా తేనె కలిపి ఒంటికి పట్టించండి. ఆపై పెసర పిండిని నువ్వుల నూనె సాయంతో ఒంటికి రాసుకుని రుద్దాలి. గుప్పెడు గులాబీ రేకల్ని లీటరు నీటిలో మరిగించి దాన్ని స్నానం నీటిలో కలుపుకోండి. దీనివల్ల చర్మానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది. ఒత్తిడీ దూరమవుతుంది.  సమపాళ్లల్లో కలిపిన కొబ్బరి, ఆముదం, ఆలివ్‌ నూనెల మిశ్రమాన్ని వేడి చేసి ఒంటికి రాసుకుని రుద్దుకోవాలి. చల్లటి నీళ్లల్లో పావుకప్పు కొబ్బరిపాలు, రెండు చుక్కల నిమ్మగడ్డినూనె కలుపుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్