చర్మ ఆరోగ్యానికీ చికిత్స

అనారోగ్యమొస్తే ఏం చేస్తాం? మందులు వాడతాం. మరి చర్మ ఆరోగ్యం సంగతేంటి? అలా ఆశ్చర్యంగా చూడకండి. శారీరక, మానసిక అనారోగ్యమేదైనా దాని ప్రభావం పడేది ముఖంపైనేనట! దానికీ ఇలా తగిన చికిత్స చేయాలంటున్నారు నిపుణులు. ముందుగా ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. స్పూను అవిసెగింజలపొడికి తగినన్ని గోరువెచ్చని నీటిని కలిపి పేస్టులా చేయాలి.

Published : 22 Oct 2021 01:48 IST

అనారోగ్యమొస్తే ఏం చేస్తాం? మందులు వాడతాం. మరి చర్మ ఆరోగ్యం సంగతేంటి? అలా ఆశ్చర్యంగా చూడకండి. శారీరక, మానసిక అనారోగ్యమేదైనా దాని ప్రభావం పడేది ముఖంపైనేనట! దానికీ ఇలా తగిన చికిత్స చేయాలంటున్నారు నిపుణులు.

ముందుగా ముఖాన్ని ఫేస్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. స్పూను అవిసెగింజలపొడికి తగినన్ని గోరువెచ్చని నీటిని కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వృత్తాకారంలో సున్నితంగా రుద్దాలి. రెండు నిమిషాల తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

ముఖం తడి ఆరాక.. రెండు స్పూన్ల పెరుగుకు అర స్పూను తేనె, చిటికెడు పసుపు చేర్చి బాగా కలపాలి. దీన్ని ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. ఈసారి ఫేస్‌వాష్‌ వాడొద్దు. నీటినే ఉపయోగించాలి. తర్వాత రోజ్‌వాటర్‌ను ముఖంపై స్ప్రే చేయాలి. ఆపై మాయిశ్చరైజర్‌ రాస్తే చాలు. ఇదండీ చికిత్స! ఏమాత్రం స్కిన్‌ డల్‌గా అనిపించినా.. ఈ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్