అందానికి మెరుగులద్దుదాం!

చిన్నచిట్కాలే.. కానీ పాటిస్తే అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఒక సారి మీరూ వీటిని ప్రయత్నించి చూడండి...

Updated : 27 Jan 2022 04:54 IST

చిన్నచిట్కాలే.. కానీ పాటిస్తే అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఒక సారి మీరూ వీటిని ప్రయత్నించి చూడండి...

అరికాళ్లు గరుకుగా చూడ్డానికి ఇబ్బందిగా మారాయా? వ్యాజ్‌లిన్‌ని రోజువిడిచి రోజు వారంలో మూడురోజులు పట్టించండి. పసిపిల్లల పాదాల్లా మృదువుగా తయారవుతాయి.

కళ్లకింద నల్లని వలయాలతో వయసైన వారిలా కనిపిస్తున్నారా? అయితే చెంచా కాఫీపొడికి తగినంత అలొవెరా జెల్‌ కలిపి కళ్లచుట్టూ ప్యాక్‌లా వేయండి. నలుపు పరార్‌.

నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండి ఆ నీటితో ఆవిరి పట్టండి…. ముఖం మీద మురికి పోవడమే కాదు.. యాక్నె వంటివీ రావు. ఇది కొరియా సౌందర్య చిట్కా. దీంతో చర్మం కొత్త కాంతినీ సంతరించుకుంటుందట.

పగిలిన పెదాలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే నిద్రపోయే ముందు కొద్దిగా నెయ్యి, తేనె కలిపి రాయండి. సమస్య తొలగి... చూడ్డానికీ బాగుంటాయి.

టొమాటోని సగానికికోసి దాంతో ముఖం రుద్దుకోండి. చర్మాన్ని ఒకే వన్నెలో మారుస్తుంది.  

పైపెదవిపై ఉన్న అవాంఛిత రోమాలు ఇబ్బంది కలిగిస్తోంటే పండిన బొప్పాయితో రుద్ది చూడండి. వారంలో రెండు మూడుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్