అధరాలకు మునుపటి కళ

అమ్మాయి ముఖసౌందర్యాన్ని పెంచే వాటిలో అధరాలదీ ప్రత్యేక పాత్రే. ఒక్కోసారి పొడిబారి, నీటి శాతం తగ్గినప్పుడు పగుళ్లు వచ్చి కళ తప్పుతుంటాయి. వాటికి మునుపటి మృదుత్వం తేవాలంటే... మృతకణాలను.. పెదాలపై పేరుకునే మృత కణాలు కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అయితే ముఖానికి వాడే స్క్రబర్స్‌...

Published : 24 Feb 2022 00:59 IST

అమ్మాయి ముఖసౌందర్యాన్ని పెంచే వాటిలో అధరాలదీ ప్రత్యేక పాత్రే. ఒక్కోసారి పొడిబారి, నీటి శాతం తగ్గినప్పుడు పగుళ్లు వచ్చి కళ తప్పుతుంటాయి. వాటికి మునుపటి మృదుత్వం తేవాలంటే...

మృతకణాలను.. పెదాలపై పేరుకునే మృత కణాలు కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అయితే ముఖానికి వాడే స్క్రబర్స్‌ వినియోగించకూడదు. స్నానం చేసిన వెంటనే మెత్తని తువ్వాలుతో పెదాలపై చర్మాన్ని మృదువుగా రుద్దితే చాలు. మృతకణాలు, మురికి దూరమవుతాయి. ఓట్స్‌, చక్కెర, తేనె, వెజిటబుల్‌ ఆయిల్‌ కలిపిన మిశ్రమం లేదా చక్కెర, కొబ్బరినూనె, దాల్చినచెక్క పొడి, తేనె మిశ్రమం లేదంటే కాఫీపొడి, చక్కెర, తేనె, బాదం నూనెల మిశ్రమాల్లో దేన్నైనా ఒకదాన్ని పెదాలపై మృదువుగా మర్దనా చేయండి. తేమ అంది పూర్వపు అందాన్ని సంతరించుకుంటాయి.

లిప్‌ మాస్క్‌.. పొడారి, పేలవంగా, కాంతి విహీనంగా కనిపిస్తోంటే.. తేనె, పెరుగు, ఆలివ్‌ నూనె మిశ్రమం లేదా తేనెకు నిమ్మరసం కలిపి మాస్క్‌గా వేయాలి. పావుగంట ఆరనిచ్చి  శుభ్రం చేస్తే చాలు. అధరాలు తాజాగా, తేమగా మారతాయి. అలాగే అయిదారు గులాబీ రేకలకు అరచెంచా పాలను కలిపిన మిశ్రమం లేదా, బీట్‌రూట్‌ రసానికి సరిపడా తేనె కలిపి పెదాలకు పట్టించి ఆరనిచ్చి కడిగినా మృదువుగా మారతాయి. మెత్తగా చేసిన స్ట్రాబెర్రీ గుజ్జుకు బాదం నూనె, తేనె కలిపిన మిశ్రమం కూడా పోషకాలు అంది ఆరోగ్యంగా మారతాయి.

లిప్‌బామ్‌... బీట్‌రూట్‌ రసాన్ని చిక్కబడే వరకు కాచి అందులో కాస్తంత నెయ్యి కలిపితే సహజ సిద్ధమైన లిప్‌బామ్‌గా మారుతుంది. ఇందులోని సి విటమిన్‌ అధరాలను ఆరోగ్యంగా ఉంచి, మెరిసేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్