అందాల తార మీరూ కావొచ్చు!

కరీనా కపూర్‌ నుంచి సారా అలీఖాన్‌, సమంతా వరకు సినిమాలు, చిత్ర వేడుకలు, ఇతర పార్టీలు... ఇలా ఎక్కడైనా నటీమణులంతా తళుక్కుమంటూ అందరిలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారి అందం అలాంటిది. అయితే అన్ని సమయాల్లోనూ అదెలా సాధ్యమంటే... ఆ రహస్యం మీ కోసం..

Published : 01 Mar 2022 00:34 IST

కరీనా కపూర్‌ నుంచి సారా అలీఖాన్‌, సమంతా వరకు సినిమాలు, చిత్ర వేడుకలు, ఇతర పార్టీలు... ఇలా ఎక్కడైనా నటీమణులంతా తళుక్కుమంటూ అందరిలో ఆకర్షణీయంగా కనిపిస్తారు. వారి అందం అలాంటిది. అయితే అన్ని సమయాల్లోనూ అదెలా సాధ్యమంటే... ఆ రహస్యం మీ కోసం..

మేకప్‌తో మాయ చేయొచ్చు.. కొన్ని కిటుకులతో సహజ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

* మీ చర్మతత్వానికి సరిపడే ప్రైమర్‌ని ఎంచుకోవాలి. ఇది బేస్‌ను ప్రకాశవంతంగా మారుస్తుంది.
* ఒక రకం ఫౌండేషన్‌కి మరో రకం హైలైటర్‌ను చేర్చి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి.  
* బుగ్గలు సహజంగా మెరిసినప్పుడే మోము మరింత అందంగా కనిపిస్తుంది. కాబట్టి  యాపిల్స్‌లా నిగనిగలాడే చెంపలకు గులాబీ రంగు షేడ్‌ మరింత వన్నె తెస్తుంది.
* కాటుక లాంటి కొహ్ల్‌ (పెన్సిల్‌ లాంటిది)తో కాకుండా మస్కారా వేసుకుంటే కళ్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
* కనుబొమలకు ఓ చుక్క కొబ్బరినూనె రాసి ఐబ్రష్‌తో మృదువుగా దువ్వండి. నల్లగా, ఒత్తుగా ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
* చివరగా అధరాలకు అదిరిపోయే రంగులు కాకుండా సహజంగా కనిపించేలా న్యూడ్‌ లిప్‌స్టిక్‌ను వేసుకుంటే సరి. దీనికి పారదర్శకమైన లిప్‌గ్లాస్‌తో మెరుగులద్దితే చూడచక్కని ముద్దుగుమ్మ మరి మీరే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని