బ్యూటీ స్నాక్‌ చేస్తారా?

కొత్తగా అనిపిస్తోందా? అలాగని అందాన్ని పెంచుకోవడానికి తీసుకునే స్నాక్స్‌గానూ పొరబడొద్దు. చర్మ సంరక్షణకు సంబంధించిన ఓ ట్రెండ్‌ ఇది. తెలుసుకోవాలంటే చదివేయండి. కొవిడ్‌ తర్వాత మన ఆడవాళ్లకు పని భారం ఎంత పెరిగిందో తెలుసు కదా! బయటికి వెళ్లడానికి ఆసక్తి చూపని వారే ఎక్కువ. చాలామంది ఉద్యోగినులు ఇప్పటికీ ఇంటి నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్నారు....

Published : 11 Mar 2022 00:59 IST

కొత్తగా అనిపిస్తోందా? అలాగని అందాన్ని పెంచుకోవడానికి తీసుకునే స్నాక్స్‌గానూ పొరబడొద్దు. చర్మ సంరక్షణకు సంబంధించిన ఓ ట్రెండ్‌ ఇది. తెలుసుకోవాలంటే చదివేయండి.

కొవిడ్‌ తర్వాత మన ఆడవాళ్లకు పని భారం ఎంత పెరిగిందో తెలుసు కదా! బయటికి వెళ్లడానికి ఆసక్తి చూపని వారే ఎక్కువ. చాలామంది ఉద్యోగినులు ఇప్పటికీ ఇంటి నుంచే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఒకరకమైన నిర్లిప్తత, ఒత్తిడి చోటు చేసుకున్నాయి. దాన్నుంచి బయట పడేయడానికే ఈ బ్యూటీ స్నాకింగ్‌. అంటే.. శరీరానికి శక్తి కోసం ఆహారం, మధ్యలో చిరుతిళ్లు తీసుకుంటాం కదా! అలా చర్మానికీ చిన్ని చిన్ని సంరక్షణలు అందించడమన్నమాట.

దీన్ని నిర్ణీత సమయాల్లోనే చేయాలనేం లేదు. సమావేశాల మధ్యలో.. బాగా చిరాగ్గా ఉన్నప్పుడు.. పనంతా పూర్తై అలా నడుం వాల్చినప్పుడు కొన్ని ప్రయత్నించండి.. చాలు. ఇది.. మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయలేదనీ, మీపై మీకు ప్రేముందని మెదడుకి పంపే సంకేతమన్న మాట. ఇది తెలియకుండానే మనసుకి ఉత్సాహాన్ని కలిగిస్తుందట. అందుకే దీన్ని ప్రయత్నిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది.

ఏం చేయొచ్చు?

పనితో తీరిక లేదు.. చిరాగ్గా ఉందా! వెళ్లి ముఖం కడుక్కొని ఓ మాస్క్‌ వేసేయండి. చర్మానికి పోషణ.. మనసుకి పునరుత్తేజం.

అలసటా... చిన్న టబ్‌ని గోరువెచ్చని నీటితో నింపి, కాళ్లు ఉంచండి. విశ్రాంతి, ఆపై మృతకణాలను తొలగిస్తే కాళ్లూ అందంగా ఉంటాయి.

తలకు నూనె పట్టించడం, ముఖానికి మర్దనా.. గోళ్లకు పెయింట్‌ వేయడం.. స్క్రబ్బింగ్‌.. ఐ మాస్క్‌.. ఇలా సమయాన్ని బట్టి, చేయొచ్చు. వీటితో చాలా మార్పు ఉంటుందంటున్నారు నిపుణులు. ప్రయత్నిస్తారా మరి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్