‘ట్రి’మ్‌ చేయడానికో కత్తెర!

పెరట్లో పచ్చదనం విలసిల్లాలంటే... విత్తు నాటిన నుంచి పూలు పూసే వరకు ప్రతి నిమిషం వాటిని పరిరక్షించాలి. ఎన్నో జాగ్రత్తలూ తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని గార్డెనింగ్‌ పనిముట్లూ కావాలి. అవేంటంటే..

Published : 14 Mar 2022 01:38 IST

పెరట్లో పచ్చదనం విలసిల్లాలంటే... విత్తు నాటిన నుంచి పూలు పూసే వరకు ప్రతి నిమిషం వాటిని పరిరక్షించాలి. ఎన్నో జాగ్రత్తలూ తీసుకోవాలి. ఇందుకోసం కొన్ని గార్డెనింగ్‌ పనిముట్లూ కావాలి. అవేంటంటే..

* గ్లవుజులు.. మొక్కలకు నీళ్లు పోయడంతో సరిపోదు. ఎరువులు వేయాలి. మొదళ్లను శుభ్రం చేయాలి. ఇలాంటి సమయంలో గార్డెనింగ్‌ గ్లవుజులు ఉపయోగిస్తే సరి. గోళ్లలోకి మట్టిపోవడం, చేతులకు ఏవైనా మొనదేలిన వస్తువులు గుచ్చుకోవడం లాంటివి జరగవు.

* తాపీ... ఇల్లు కట్టే సమయంలో చూస్తాం కదా! ఇది గార్డెనింగ్‌లోనూ అవసరమవుతుంది. మట్టిని పెకిలించడం, వేయడం.. లాంటి పనులకు వాడుకోవచ్చు.

* హ్యాండ్‌ ప్రూనర్‌... కటింగ్‌ ప్లేయర్‌లా కనిపించినా ఇదో కత్తెర. మొక్కలు అందంగా, ఆరోగ్యంగా పెరగడానికి ట్రిమ్‌ చేస్తాం కదా! ఇది అందుకు సాయపడుతుంది.

* గార్డెనింగ్‌ ఫోర్క్‌.. నేలను చదును చేయడానికి ఉపయోగిస్తారు దీన్ని. ముఖ్యంగా లాన్‌ లాంటి ప్రాంతం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.

* స్ప్రే సీసా.. మొక్కలపై పేరుకుపోయిన దుమ్మూధూళీ తొలగించడానికీ, చిన్న మొక్కలకు నీరందించడానికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. క్రిమిసంహారకాలను స్ప్రే చేయడానికీ వాడుకోవచ్చు.

* నీళ్ల క్యాను... మొక్కలకు కావాల్సిన ప్రాథమిక అవసరాల్లో నీళ్లు ప్రధానమైనవి. మరి వాటిని పోయడానికి నీళ్ల క్యాను కావాలి కదా.... మార్కెట్‌లో రకరకాల సైజుల్లో దొరుకుతాయివి.

* ఎండిపోయిన ఆకులు, పూలను శుభ్రం చేయడానికి చీపురులాంటి గార్డెనింగ్‌ బ్రూమ్‌, అలాగే గార్డెనింగ్‌ పైప్‌ కూడా ఉంటే మంచిది. ఎక్కువ మొక్కలు, చెట్లున్నప్పుడు పైప్‌తో పని సులువవుతుంది. మీకు శ్రమా అనిపించదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్