లెగ్గింగ్స్‌... చూసి కొనండి!

కుర్తీ, టాప్స్‌... వేటికైనా లెగ్గింగ్స్‌ చక్కగా నప్పుతాయి. రకరకాల రంగుల్లో, విభిన్న డిజైన్లలోనూ లభ్యమవుతోన్న లెగ్గింగ్స్‌ అంటే యువతలో రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది. సరైన వాటిని ఎంచుకోకపోతే మీ మొత్తం డ్రెస్‌ లుక్కే పోతుంది.

Published : 09 Apr 2022 01:49 IST

కుర్తీ, టాప్స్‌... వేటికైనా లెగ్గింగ్స్‌ చక్కగా నప్పుతాయి. రకరకాల రంగుల్లో, విభిన్న డిజైన్లలోనూ లభ్యమవుతోన్న లెగ్గింగ్స్‌ అంటే యువతలో రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది. సరైన వాటిని ఎంచుకోకపోతే మీ మొత్తం డ్రెస్‌ లుక్కే పోతుంది. కాబట్టి సరైన ఫిట్‌తో ఉండే లెగ్గింగ్స్‌ ఎంచుకోవాలి. అందుకోసం ఏం చేయాలంటే...

ఎలాంటి వేసుకోవాలి?

* పొట్ట కాస్త ఎక్కువగా ఉండే వారు బాడీ షేపర్‌ లెగ్గింగ్స్‌ను ఎంచుకోవడం మేలు.

* ఎత్తు తక్కువగా ఉన్న వారికి ‘లో వెయిస్ట్‌ లెగ్గింగ్స్‌’ చక్కని ఎంపిక. పొడుగ్గా ఉన్న వారికి ‘హై రైజ్‌ లెగ్గింగ్స్‌’ నప్పుతాయి.

* పెన్సిల్‌ ఫిట్‌, పాంట్‌ ఫిట్‌ అని లెగ్గింగ్స్‌లో రెండు రకాలుంటాయి. నచ్చిన/టాప్‌లను బట్టి వీటిలో సరిపోయేది ఎంచుకోవచ్చు.

* ఫ్రంట్‌ సీమ్‌ లేని లెగ్గింగ్స్‌ను వేసుకోవద్దు. సీమ్‌ లెస్‌ లెగ్గింగ్స్‌ మార్కెట్లో దొరుకుతాయి.

రెండు కాళ్ల మధ్య లెగ్గింగ్‌ ముడుచుకు పోయేలా ఉంటే (క్యామిల్‌ టో) దాన్ని కనిపించకుండా చేసేందుకు ‘క్యామిల్‌ టో కన్సీలర్‌’ను (సిలికాన్‌తో తయారైన చదునైన, వృత్తాకార భాగం) వాడాలి.

* మందమైన వస్త్రంతో తయారైన లెగ్గింగ్‌ను వేసుకున్నప్పుడు అతుకులు లేని ప్యాంటీస్‌ను వాడాలి. అప్పుడే ప్యాంటీ లైన్‌ లెగ్గింగ్‌ లోనుంచి బయటకు కనిపించదు.
గుర్తుంచుకోండి...

* మీ పొట్ట ఎత్తుగా ఉండి బాడీ షేపర్స్‌ వాడుతున్నప్పుడు వాటిపైన లెగ్గింగ్స్‌ వద్దు. బదులుగా బాడీ షేపర్‌ ఉండే లెగ్గింగ్స్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.

* షార్ట్స్‌ పై నుంచి కూడా లెగ్గింగ్స్‌ వేసుకోవద్దు. ఇలా చేస్తే ప్రస్ఫుటంగా బయటకు కనిపించి చూడటానికి బాగోదు.

* కాళ్లు లావుగా ఉండే అమ్మాయిలు సాదా లెగ్గింగ్స్‌ కంటే పూలు, ప్రింట్లున్నవి ఎంచుకుంటే మంచిది.  

* క్రాప్‌ టాప్స్‌లకు జతగా లెగ్గింగ్స్‌ను ఎంచుకునేటప్పుడు కాటన్‌ రకానికి దూరంగా ఉండాలి. ముదురు రంగుల్లో లైక్రా, నైలాన్‌, రేయాన్‌ రకాలను ఎంచుకోవాలి. ఫ్యాబ్రిక్‌ కుర్తీలకు జతగా కాటన్‌వి వేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్